అన్వేషించండి
Telangana Cabinet Decisions: పేదవారికి గుడ్‌న్యూస్.. 2.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు - తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Indiramma Housing Scheme | తెలంగాణ కేబినెట్ భేటీలో జూన్ 1 నుండి 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరుకు ఆమోదం తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్లకు 3 లక్షల వరకు సాయం అందించనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ
1/5

హైదరాబాద్: డా. బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. జూన్ 1వ తేదీన ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది.
2/5

ఈ రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 1500 కొత్త ఇళ్లు ఇస్తూనే, గత ప్రభుత్వాలలో ఇళ్లు మంజూరై బేస్‌మెంట్ స్థాయిలో ఆగిపోయిన వాటికి రూ. 3 లక్షలు, గోడలు కట్టి శ్లాబ్ వేసే స్థాయిలో ఉన్న వాటికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు పొంది, ఇప్పటికీ నిర్మాణం పూర్తికాని సుమారు 20 వేల మందికి కూడా రూ. 5 లక్షలలో మిగిలిన మొత్తాన్ని ఇచ్చి పూర్తి చేయిస్తారు.
Published at : 24 May 2026 06:45 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















