Snake Bite: పాము కరిచింది.. పసుపుతో కట్టు కట్టి నిద్రపుచ్చారు.. చివరికి..
అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లిన చిన్నారి మధ్యాహ్నానికి విగతజీవిగా మారడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పాము కరిచిన వెంటనే సరైన రీతిలో స్పందించి ఉంటే తమ బిడ్డ బతికి ఉండేదని వాపోయారు.
పాము కరిస్తే తక్షణం ఎలా స్పందించాలో తెలియని మహిళ వల్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారికి పాము కరిచిన వెంటనే కరిచిన చోట పసుపు రాసి కట్టుకట్టి ఓ ఆయా పడుకోబెట్టింది. ఈ ఘటన మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో జరిగింది. ఉదయాన్నే చిరునవ్వులు చిందిస్తూ అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లిన చిన్నారి మధ్యాహ్నానికి విగతజీవిగా మారడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పాము కరిచిన వెంటనే అంగన్ వాడీలో పని చేస్తున్న ఆయా సరైన రీతిలో స్పందించి ఉంటే తమ బిడ్డ బతికి ఉండేదని వాపోయారు.
స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బయ్యారం గ్రామంలో కామల్ల రాజు - సంతోష దంపతులు ఉంటున్నారు. వీరికి నిత్యశ్రీ అనే నాలుగేళ్ల కుమార్తె ఉంది. వీరు ఏడాదిన్నర కాలంగా తమ కూతుర్ని అదే గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రానికి పంపిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అంగన్ వాడీ కేంద్రం ముందు చిన్నారి ఆడుకుంటుండగా.. బాలిక నిత్యశ్రీ ఒక్కసారిగా కింద పడిపోయింది. వెంటనే అదే కేంద్రంలో పని చేస్తున్న ఢాకమ్మ అనే ఆయా వచ్చి గమనించింది. ఎడమ కాలు పాదం వద్ద రక్తం కారటాన్ని గమనించిన ఆయా ఢాకమ్మ ఆస్పత్రికి తరలించకుండా.. గాయం వద్ద పసుపు రాసి, కట్టు కట్టి అంగన్ వాడీ కేంద్రంలోనే నిద్రపుచ్చింది.
కాసేపటి తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టేందు కోసం చిన్నారిని లేపే ప్రయత్నం చేయగా.. బాలిక నిద్ర లేవలేదు. దీంతో అంగన్ వాడీ కార్యకర్త అనిత చిన్నారి తల్లికి సమాచారం అందించింది. వారంతా పాపను హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలిక పాము కాటుతో మృతి చెందినట్టు గుర్తించారు. అంగన్ వాడీ కేంద్రం పక్కనే మురుగు కాల్వలు, గవర్నమెంట్ స్కూల్ ప్రహరీ ఉన్నాయి. బాలిక మూత్ర విసర్జన కోసం గోడ వద్దకు వెళ్లిన సమయంలో పాము కాటేసి ఉండొచ్చని స్థానికులు అక్కడ పరిశీలించగా.. గోడ సందులో రెండు నాగుపాము పిల్లలు కనిపించాయి. పాము కాటును ఆయా గుర్తించి ఉంటే చిన్నారి ప్రాణం పోకుండా ఉండేదని తల్లిదండ్రులు తీవ్రంగా రోధించారు. వారిని చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు.
Also Read: చాక్లెట్ ఇస్తానని బాలుడ్ని రమ్మన్న యువకుడు.. పొదల్లోకి తీసుకెళ్లి పాడుపని, భయంతో పరుగులు
Also Read: యువతిపై ఫేస్‌బుక్ ఫ్రెండ్ దారుణం.. కదులుతున్న కారులో అత్యాచారం.. ఆపై దారుణమైన స్థితిలో..!
Also Read: అక్కాచెల్లెళ్లపై ఐదేళ్లుగా అత్యాచారం.. మాస్టర్ ప్లాన్ వేసిన భూత వైద్యుడు, అతని కొడుకుతో కూడా..