By: ABP Desam | Published : 26 Nov 2021 08:24 AM (IST)|Updated : 26 Nov 2021 08:26 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం జరిగింది. మూఢ నమ్మకాలతో ఓ భూత వైద్యుడ్ని ఆశ్రయించిన మహిళను లొంగదీసుకొని ఆమె కుమార్తెలపై అతను అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. మంత్రాల పేరుతో ఇద్దరు యువతులపై ఓ బాబా అత్యాచారానికి ఒడిగట్టాడు. పాతబస్తీ కిషన్ బాగ్‌కు చెందిన మహిళ విషయంలో ఈ ఘటన జరిగింది. వివరాలివీ..
అనారోగ్యం కారణంతో వైద్యం కోసం ఓ మహిళ భూత వైద్యుడ్ని ఆశ్రయించింది. తాను మంత్రాలు వేసి ఆరోగ్యం బాగుచేస్తానని నమ్మించిన భూత వైద్యుడు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మనసుకు దెయ్యం పట్టిందని భయభ్రాంతులకు గురి చేసి ఆ మహిళను లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు తోడుగా వచ్చిన బాధితురాలి సోదరిపైన కూడా మాంత్రికుడు కన్నేశాడు. భూతం పట్టిందని ఇద్దరినీ లొంగదీసుకున్నాడు. ఇలా అక్కా చెల్లెళ్లపై భూత వైద్యుడు ఐదేళ్ల నుంచి అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. అంతేకాక, భూత వైద్యుడి కుమారుడు కూడా ఐదేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో ఈ దారుణం చోటు చేసుకుంది.
పాతబస్తీ కిషన్‌బాగ్‌కు చెందిన ఓ మహిళ తల్లి అనారోగ్యం పాలైంది. ఆమెకు వ్యాధి నయం కాకపోవడంతో స్థానికుల సూచన మేరకు 2005లో చాంద్రాయణగుట్టలోని భూత వైద్యుడు సయ్యద్ హసన్ అక్సారిని ఆశ్రయించింది. తల్లి ఆరోగ్యం కుదుటపడటంతో భూత వైద్యుడి కారణంగానే తల్లి కోలుకుందని నమ్మింది. అనంతరం ఆ మహిళ ఫ్యామిలీలో వచ్చిన గొడవల కారణంగా భర్తతో విడాకులు తీసుకుని విడిగా ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న భూత వైద్యుడు బాధిత మహిళపై కన్నేశాడు. విడాకులు ఇచ్చిన భర్త నీ శరీరంపై మంత్రాలు చేశాడని భూతవైద్యుడు నమ్మించాడు. ఆ తర్వాత అమె ఇల్లు అమ్మించి డబ్బులు కూడా కాజేశాడు.
ఇల్లు అమ్మిన తర్వాత బాధితురాలు సమీపంలోని బండ్లగూడకు తన నివాసం మార్చింది. ఆరోగ్యం బాగోలేదని భూత వైద్యుడిని కలుస్తుండటంతో బాణామతి బూచిచూపి ఆమెపై 2016 నుంచి లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నాడు. బాధితురాలి వెంట వచ్చిన సోదరిపై కన్నేసిన భూత వైద్యుడు.. తన అక్క భర్త మంత్రాలు చేశాడని నమ్మించి భయపెట్టి ఆమెను కూడా లొంగదీసుకున్నాడు. ఈమెపై కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. భూత వైద్యుని కుమారుడు సయ్యద్ అఫ్రోజ్ కూడా సోదరిపై లైంగిక దాడులకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. బాధితురాళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి భూత వైద్యులను అరెస్టు చేశామని వెల్లడించారు. వీరి నుంచి తాయత్తులు, జీడి గింజలు, సాంబ్రాణి పొడి తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. అనారోగ్యం పాలైతే ప్రజలు భూత వైద్యులను నమ్మవద్దని పోలీసులు పిలుపునిచ్చారు.
Also Read: Viveka Case : దేవిరెడ్డి శంకర్ రెడ్డికి వారం రోజుల సీబీఐ కస్టడీ.. సంచలన విషయాలు బయటకు వస్తాయా ?
Also Read: Warangal: బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీ.. బాధితులు లబోదిబో.. డబ్బులడిగితే బెదిరింపులు
Also Read: Sujana CEO : సుజనా ఫౌండేషన్ సీఈవో హత్య ? బెంగళూరు రైల్వే ట్రాక్‌పై మృతదేహం !
Vemulawada Kid Kidnap Case: గంటల వ్యవధిలో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన వేములవాడ పోలీసులు, క్షేమంగా తల్లీ ఒడికి బాలుడు
Karate Kalyani Counter : పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు కరాటే కల్యాణి - తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణ !
Digital Rape Case : డిజిటల్ రేప్ కేసులో 81 ఏళ్ల వ్యక్తి అరెస్ట్ ! అసలేంటి ఈ డిజిటల్ రేప్ ?
Vijayawada Drugs : బెజవాడ డ్రగ్స్ కథ ఎక్కడ తేలబోతోంది ? అరుణాచలం గుట్టు బయట పెట్టేశాడా ?
Srikakulam News : ఏపీలో మరో పోలీసు సూసైడ్, ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య!
Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్
Gold-Silver Price: స్థిరంగా బంగారం, వెండి ధరలు - మీ నగరంలో రేట్లు ఇవీ
Petrol-Diesel Price, 17 May: వాహనదారులకు నేడు కాస్త ఊరట! తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇక్కడ మాత్రం పైపైకి
Astrology: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!