By: ABP Desam | Updated at : 25 Nov 2021 05:30 PM (IST)
దేవిరెడ్డికి వారం సీబీఐ కస్టడీ
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అతడిని 8 రోజులు కస్టడీకి అప్పగించాలంటూ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం శివశంకర్ రెడ్డిని సీబీఐ కస్టడీకి అనుమతించింది. అయితే 7 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు డిసెంబరు 2వ తేదీ వరకు శివశంకర్‌రెడ్డిని సీబీఐ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనుంది. ప్రస్తుతం శివశంకర్ రెడ్డి కడప సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు.
Also Read : క్రిప్టోపై బిల్లుపై కేంద్రం ప్రకటన.. సూర్యాపేటలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అలియాస్ దొండ్లవాగు శంకర్‌రెడ్డి పేరు ఉంది. ఆయన ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ఆర్‌సీపీ తరపున పులివెందుల పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉండగా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.
Also Read: Father Rape: మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం.. ఏడాదిగా అదే పని.. చివరికి..
దస్తగిరి వాంగ్మూలం బయటకు వచ్చిన తర్వాత శివశంకర్‌రెడ్డిని సీబీఐ నవంబరు 17వ తేదీన హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుంది. వివేకాను హత్యచేస్తే శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడంటూ ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ నెల 15న కడపలో విచారణకు హాజరుకావాలని శివశంకర్‌రెడ్డికి సీబీఐ సమాచారం ఇచ్చిన హాజరు కాలేదు. దాంతో సీబీఐ ప్రత్యేక బృందం హైదరాబాద్‌లో ఆయనను పట్టుకుంది. కడపకు తరలించింది. పులివెందులకు తీసుకొచ్చి స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచింది.
ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ వివేకా కుమార్తె సునీత గతంలో హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పొందుపరిచిన 15 మంది అనుమానితుల జాబితాలో శివశంకర్‌రెడ్డి ఒకరు. ఆయనపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో కస్టడీలో శివశంకర్ రెడ్డి నుంచి సీబీఐ అధికారులు ఎలాంటి వివరాలు బయటకు లాగుతారన్నది ఆసక్తికరంగా మారింది.
లక్కుంటే అంతే మరి! టమోటా పట్టినా వజ్రమైపోతుంది!
Weather Latest Update: 13న మరో అల్పపీడనం, ఇంకో వారం వర్షాలే! భారీ గాలులతో ఈ ప్రాంతాలవారికి అలర్ట్: IMD
Gold-Silver Price: ఈరోజు భారీగా పడిపోయిన బంగారం! నేడు వెండి ఎంత తగ్గిందంటే
Petrol-Diesel Price, 11 August: నిలకడగా ఇంధన ధరలు- మీ నగరంలో ఈరోజు ఇలా
Mohan babu : షిర్డీ కన్నా తమ ఆలయమే గొప్పంటున్న మోహన్ బాబు - ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?
Flag Code: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి
Karimnagar: హత్య చేసి గుట్టుగా అంత్యక్రియలకు, నమ్మేసిన జనం - ఆ తప్పిదంతో పట్టేసిన పోలీసులు
ఉచిత పథకాలపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ- మోదీ, కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం
Tabu Injured : హైదరాబాద్‌లో హీరోయిన్‌కు గాయాలు - రెప్ప పాటులో కంటికి తప్పిన ప్రమాదం