అన్వేషించండి

KTR ChitChat: అనుకున్నన్ని సీట్లు రాలేదని కాంగ్రెస్‌లోనే అసంతృప్తి - అరెస్టుకు సిద్ధం - కేటీఆర్ చిట్ చాట్

Municipal elections: మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లు రాలేదని కాంగ్రెస్‌లో అసంతృప్తి ఉందని కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ రేసులో మళ్లీ నోటీసులు ఇస్తారన్న సమాచారం ఉందన్నారు.

KTR Chit Chat on municipal elections Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిని నింపాయని.. వారు ఆశించిన స్థాయిలో స్థానాలు సాధించలేకపోయారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పార్టీకి సాధారణంగా ఉండే సానుకూలతను వాడుకుని.. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసినా కాంగ్రెస్‌కు పూర్తి విజయం దక్కలేదని ఎద్దేవా చేశారు. మీడియా ప్రతినిధులతో కేటీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు.  తమ పార్టీ కార్యకర్తలు గట్టిగా పోరాడటం వల్లే 17 మున్సిపాలిటీల్లో విజయం సాధించామని.. హంగ్ ఏర్పడిన చోట్ల కూడా తమకే అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైందని గుర్తు చేస్తూ.. ఇప్పుడు తమ ప్రదర్శన చాలా మెరుగ్గా ఉందని విశ్లేషించారు.

బీజేపీ హడావిడి ఎక్కువ.. ఫలితాలు తక్కువ 

బీజేపీ ప్రదర్శనపై కూడా కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చి ప్రచారం చేసినా.. హడావిడి చేసినా ఒక్క మున్సిపాలిటీని కూడా గెలవలేకపోయారని విమర్శించారు. గతంతో పోలిస్తే బీజేపీకి ఓట్లు , వార్డులు తగ్గాయని.. కేవలం గొప్పలు చెప్పుకోవడానికే ఆ పార్టీ పరిమితమైందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అధినేతల పర్యటనల కంటే స్థానిక అంశాలే కీలకంగా ఉంటాయని.. ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని ఎదిరించి తమ పార్టీ అద్భుతంగా నిలబడిందని కొనియాడారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తమ పార్టీని తక్కువ అంచనా వేసిన వారికి ఈ ఫలితాలే సరైన సమాధానమని స్పష్టం చేశారు.

 ఎక్స్ అఫీషియో నిబంధనలపై అయోమయం 

ఎన్నికల తర్వాత మేయర్ మరియు చైర్మన్ ఎన్నికల్లో కీలకమైన ఎక్స్ అఫీషియో సభ్యుల నిబంధనలపై ప్రభుత్వానికి కనీస అవగాహన లేదని కేటీఆర్ విమర్శించారు. కలెక్టర్లు ఒక మాట.. చీఫ్ సెక్రటరీ మరో మాట చెబుతూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నిబంధనల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ధ్వజమెత్తారు. మేయర్ పీఠాలను దక్కించుకోవడానికి ప్రభుత్వం అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.

 ఫార్ములా-ఈ విచారణ ఒక తమాషా 

ప్రభుత్వం మరోసారి ఫార్ములా-ఈ అంశాన్ని తెరపైకి తేవడం కేవలం కాలక్షేపం కోసమేనని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే నాలుగుసార్లు విచారణకు పిలిచి ఏమీ నిరూపించలేకపోయారని.. ఇప్పుడు మళ్ళీ పిలవడం తమాషాగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నిసార్లు పిలిచినా వెళ్లి సత్యాన్ని చెబుతామని.. విచారణలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ కేసులో ఎలాంటి పస లేదని అధికారులే ముఖ్యమంత్రికి చెప్పినా.. కేవలం రాజకీయ కక్షతోనే ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. చివరికి జైలుకు పంపినా భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.                                                                   

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
HYDRAA Ranganath High Court Orders: హైడ్రా కమిషనర్‌కు బిగ్ షాక్ - రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం !
హైడ్రా కమిషనర్‌కు బిగ్ షాక్ - రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం !
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Embed widget