By: ABP Desam | Updated at : 17 Dec 2021 05:40 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
పుష్పపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ట్వీట్(Image Source :Cyberabad traffice police twitter)
భారీ అంచనాలతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ శుక్రవారం రిలీజ్ అయ్యింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. థియేటర్లలో తగ్గేదే లే అంటూ పుష్పరాజ్ దూసుకెళ్తోంది. పుష్ప సినిమాపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు వినూత్నంగా ప్రచారం చేసే సైబరాబాద్ పోలీసులు పుష్పపై పోస్టర్ క్రియేట్ చేశారు. 'హెల్మెట్, మిర్రర్స్ లేవా... పుష్ప' అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. పుష్ప పోస్టర్ లో బైక్ పై ఉన్న అల్లు అర్జున్ ఫోటోను షేర్ చేస్తూ పుష్ప ట్రైలర్ లో ఫేమస్ అయినా పార్టీ లేదా పుష్ప డైలాగుని మార్చి హెల్మెట్, సైడ్ మిర్రర్స్ లేవా పుష్ప అంటూ మీమ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అయ్యింది.
Also Read: 'పుష్ప'లో ఆ రాజకీయ నాయకుడు ఎవరు?
Wear Helmet & Fix Rearview Mirrors. Be Safe.#RoadSafety #RoadSafetyCyberabad #Pushpa #PushpaRaj pic.twitter.com/USlupBLHIR
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) December 17, 2021
అవగాహనలో వినూత్నం
తెలంగాణలో పోలీసు ట్విట్టర్ ఖాతాలోకి వెళ్తే చాలా మీమ్స్ కనిపిస్తాయి. అవన్నీ చూసి నవ్వుకునేలా ఉన్నా అందులోని మెసేజ్ మాత్రం మన ప్రాణాలకు రక్షణ కోసమే. సోషల్ మీడియా ఆధారంగా చేసుకుని ప్రజల్లో అవగాహన పెంచుతుంటారు. అప్పుడప్పుడు ట్రోలింగ్ చేస్తుంటారు. వాహనదారులు తప్పులు చేస్తే ఆ ఫిక్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ సవ్యంగా పాటించాలని సైబరాబాద్ పోలీసులు సూచిస్తుంటారు.
Also Read: Pushpa Twitter Review: అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో... ఇరగదీశాడట!
ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పుష్ప
సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘పుష్ప’ సినిమా శుక్రవారం ఉదయం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సుకుమార్-అల్లు అర్జున్ మాస్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగ్గేదేలే అంటూ థియేటర్లలో సందడి చేస్తున్నారు. అల్లు అర్జున్‌ను ఆర్య సినిమాతో తెలుగులో యువ ప్రేక్షకులకు దగ్గర చేసిన దర్శకుడు సుకుమార్. అల్లు అర్జున్‌కు మలయాళంలో మార్కెట్ ఏర్పడటానికి కారణం కూడా ఆ సినిమాయే. ఆర్య తర్వాత ఇద్దరి కాంబినేషన్‌లో ఆర్య - 2 వచ్చింది. అందులో హీరోది నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప: ద రైజ్. రష్మికా మందన్నా హీరోయిన్. అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. దీంతో హిందీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఆర్య, ఆర్య 2కు సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్, ఈ సినిమాకూ సంగీతం అందించారు. దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి పాటలు ముఖ్యంగా సమంత డాన్స్ చేసిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావా... ఊఊ అంటావా ప్రేక్షకుల్లోకి వెళ్లాయి.
Also Read: Pushpa Movie Review - 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
Breaking News Live Updates: హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం, చార్మినార్ వద్ద కాలిపోయిన దుకాణం
Khammam: సీఎం జగన్‌పై తెలంగాణ మంత్రి వ్యాఖ్యల దుమారం! అదే పనిగా విమర్శలు, అందులో ఆంతర్యంటి?
Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్, ముచ్చటగా మూడోసారి
Hyderabad: నేడు Hydకి మోదీ, ఈ రూట్లలో ట్రాఫిక్‌కు నో ఎంట్రీ! ముందే వేరే మార్గాలు చూసుకోండి
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ! ఏపీలో నేడు 2-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు
Telangana Police Jobs: పోలీసు ఉద్యోగాలకు ఇంకా అప్లై చేయలేదా? ఇవాళే లాస్ట్ డేట్!
Modi Hyderabad Tour Today: నేడే హైదరాబాద్‌కు ప్రధాని, రంగంలోకి 2 వేల మంది పోలీసులు - పూర్తి షెడ్యూల్ ఇదీ
Amalapuram Violence: అమలాపురం అల్లర్ల కేసులో కీలక వ్యక్తి అరెస్టు, అసలు ఎవరీ అన్యం సాయి?
AP Ministers Bus Tour: శ్రీకాకుళం టు అనంతపురం- నేటి నుంచే ఏపీ మంత్రుల బస్సు యాత్ర