Bus Conductor: ప్రయాణికులు దిగాక వెళ్లి కొవిడ్ పరీక్ష చేయించుకున్న కండక్టర్.. పాజిటివ్ గా తేలడంతో మెుదలైన ఆందోళన
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. లక్షణాలు లేకున్నా.. కొవిడ్ సోకుతుంది. తాజాగా ఓ బస్ కండక్టర్ కు పాజిటివ్ వచ్చింది.
ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు బస్టాండ్ లో కరోనా కలకలం రేగింది. కండక్టర్ కు పాజిటివ్ రావడంతో ఆందోళన మెుదలైంది. హనుమకొండ-చెన్నూరు ఆర్టీసీ బస్సులో ఓ మహిళా కండక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. చెన్నూరుకు బస్టాండ్ లో ప్రయాణికులు దిగాక.. డ్రైవర్ తో కలిసి టీ తాగడానికి వెళ్లారు. అక్కడ కాసేపు ముచ్చటించారు. దగ్గరలోనే కరోనా పరీక్షలు చేస్తున్న కేంద్రం కనిపించింది. అటువైపు వెళ్లి.. ఏఎన్ఎంతో కాసేపు మాట్లాడిన కండక్టర్.. మాట వరసకు తనకు కూడా కొవిడ్ పరీక్ష చేయాలని కోరారు. అయితే కండక్టర్ కు ఎలాంటి లక్షణాలు లేవు. కరోనా పరీక్ష చేయగా.. పాజిటివ్ గా తేలింది. ఈ విషయం తెలిసి.. ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందిలో ఆందోళన మెుదలైంది. ఆమె ఎవరెవరితో మాట్లాడారనే విషయంపై ఆరా తీస్తున్నారు.
తెలంగాణ కరోనా కేసులు
తెలంగాణలో 55,883 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. కొత్తగా 2,043 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో ముగ్గురు మృతి చెందారు. కరోనా నుంచి మరో 2,013 మంది పూర్తిగా కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 22,048 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ విద్యా సంస్థల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగించాలని విద్యాశాఖకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ సిఫార్సు మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: Osmania University: ఓయూ పరిధిలో ఆన్ లైన్ తరగతులు.. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్ణయం
Also Read: Telangana Covid Cases: తెలంగాణలో కొత్తగా 2,043 కరోనా కేసులు నమోదు.. ముగ్గురు మృతి
Also Read: School Holidays: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. సెలవులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు సురేశ్
Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే