![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Crime News: సగం రేటుకు బంగారం ఇస్తామని ఫోన్ కాల్.. నోట్ల కట్టలతో పొరుగు రాష్ట్రం వెళ్లాక ఊహించని ట్విస్ట్..
Fake Gold Coin Case: పెట్టుబడి లేకుండా భారీ లాభాలు, తక్కువ పెట్టుబడికి రెట్టింతలు, సగం రేటుకే మేలిమి బంగారం అంటూ ప్రకటనలు చూసి సోదరులు మోసపోయిన ఘటన మరొకటి తాజాగా వెలుగుచూసింది.
Fake Gold Coin Case: తక్కువ పెట్టుబడికి రెట్టింతలు, పెట్టుబడి లేకుండా భారీ లాభాలు, తక్కువ రేటుకే నాణ్యమైన బంగారం.. ఇలాంటి ప్రకటనలు, మాయమాటలు నమ్మే వాళ్లు ఉన్నంత వరకు మోసాలు జరుగుతూనే ఉంటాయి. పోలీసులు, అధికారులు ఎన్నిసార్లు చెప్పినా... అత్యాశకు పోయి చేతులు కాల్చుకుంటున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉంటాం. ఎన్ని కథనాలు వచ్చినా అత్యాశపరుల్లో మార్పు రానంతవరకు మోసాలు జరుగుతుంటాయి. మోసపోవడానికి పొరుగు రాష్ట్రానికొచ్చి మరీ కేటుగాళ్లు ఉచ్చులో చిక్కుకుపోయి పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కొని తెచ్చుకొన్నారు తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన బాజాకుంట గ్రామానికి చెందిని పరమేష్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాడు. పరమేష్ కు కొద్ది రోజుల క్రితం కర్ణాటకల ని బళ్ళారి నుంచి ఒక అపరిచిత వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఈ కాల్ సారాంశం ఏమంటే.. మాకు బంగారు నాణేలు దొరికాయి. అవి తక్కువ ధరకే అమ్ముతున్నాం అంటూ మాట్లాడారు. మొదట్లో ఈ మాటలను నమ్మని పరమేష్ చివరకు కేటుగాళ్లు పదే పదే చెప్పేసరికి నమ్మేశాడు. కావాలంటే వాటిని పరీక్షించేందుకు రమ్మని చెప్పారు. దీంతో కేటుగాళ్లు చెప్పినట్లుగా బళ్ళారికి వెళ్లగా ఒక నాణెం ఇచ్చి చెక్ చేసుకోమని చెప్పారు. అది ఒరిజినల్ బంగారు నాణెం కావడంతో పరమేష్ లో నమ్మకం రెట్టింపైంది.
తనకు లభించిన బంగారు నాణెలలో ఒకటిన్నర కిలో అమ్ముతానని నిందితులు పరమేష్‌ను నమ్మించారు. పదిలక్షలు ఇస్తే బంగారు నాణెలు ఇస్తామని తెలిపారు. డబ్బులు రెడీ చేసుకొని కాల్ చేస్తామని తెలిపాడు. డబ్బులు రెడీ చేసుకొని కాల్ చేసిన పరమేష్ కు అనంతపురం శివార్లలోని కురుగుంట వద్దకు రమ్మని చెప్పారు. దీంతో తన తమ్ముడు మహేష్ ను వెంటబెట్టుకుని నిందితులు చెప్పిన చోటుకు వెళ్లారు. అప్పటికే నిందితులు పక్కా ప్లాన్ ప్రకారం వున్నారు. పరమేష్ రాగానే నకిలీ బంగారు నాణేలను ఇచ్చి డబ్బుల సంచిని లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. వారిని వెంబడించేందుకు ప్రయత్నించినప్పటకీ పలితం లేకపోవడంతో పరమేష్ ఆయన సోదరుడు మహేశ్ అనంతపురం రూరల్ పోలీసులును ఆశ్రయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకొన్నారు.
కాల్ డేటా ఆదారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. బాధితుల అత్యాశే ఇలాంటి మోసాలకు కారణాలు అవుతున్నాయని అనతపురం రూరల్ సీఐ మురళీదర్ రెడ్డి అన్నారు. సగం రేటుకు, తక్కువ రేటుకు ఎందుకు ఇస్తారని కనీసం ఆలోచించకుకండా మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకొని చివరకు పోలీసుల వద్దకు వస్తున్నారని చెప్పారు. ఇప్పటికే గతంలో ఇలాంటి ముఠాలు అనేకసార్లు మభ్యపెట్టి బాధితులను మోసం చేసిన కేసులు అనంతపురంలో చాలా నమోదు అయ్యాయని, ఇటీవలి కాలంలో తగ్గాయి అనుకుంటున్న సమయంలో మళ్లీ రిపీట్ అయ్యాయంటున్నారు పోలీసులు. సో ఇలాంటి ఫేక్ కాల్స్, నకిలీ బంగారం, రెట్టింపు లాభాలు అంటే అలాంటి ముఠాల ఉచ్చులో పడుకుండా జాగ్రత్తగా ఉండాలని అనంతపురం పోలీసులు సూచిస్తున్నారు.
Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే
Also Read: Booster Dose: కోవిడ్ వ్యాక్సిన్ - బూస్టర్ డోస్‌కు తేడా ఏమిటీ? ఎవరు అర్హులు? ఏది బెస్ట్?
Also Read: గొంతులు కోస్తున్న చైనా మాంజా.. నిషేధం విధించినా జోరుగా అమ్మకాలు ! ఇంకెంత మంది ప్రాణాలు పోవాలి ?
Also Read: Weather Updates: ఏపీకి తప్పని కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాల్లో ఉరుములు కూడా.. తెలంగాణలో వెదర్ ఇలా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)