అన్వేషించండి

CM Revanth Reddy: రాహుల్ గాంధీ గెలవకపోతే పేదల భూములు, ఆస్తులు కోల్పోతారు- ఢిల్లీలో రేవంత్ రెడ్డి

Congress ramlila maidan rally | కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్, ఖర్గే సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. 'ఓటు దొంగ గద్దె దిగిపో' నినాదంతో ప్రదర్శన నిర్వహించారు.

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి సంబంధించి ఒక ప్రకటన చేసి వివాదం రేకెత్తించారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆదివారం నాడు నిర్వహించిన 'ఓటు చోర్ గద్దీ చోడ్' ర్యాలీలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈసారి రాహుల్ గాంధీని గెలిపించకపోతే ఎన్డీయే ప్రభుత్వం పేదల భూములు, ఆస్తులు కూడా లాగేసుకుంటుందని ఆరోపించారు. 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు?

'దేశం కోసం ఈసారి రాహుల్ గాంధీని గెలిపించాలి. లేకపోతే పేదలు ఓటు హక్కును కోల్పోతారు. ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగిస్తే, వారి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, భూములు, ఆస్తులు అన్నీ లాగేసుకుంటారు. ఆదివాసీలు అన్నీ కోల్పోతారు. మనం ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ సైనికుల్లా పోరాడాలి' అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

రాంలీలా మైదానంలో ఖర్గే ఏమన్నారు?

ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. నేటి పోరాటం ఒక్క నాయకుడిది కాదు, దేశ రాజ్యాంగం, ఓటు హక్కు, సామాన్య ప్రజల భవిష్యత్తు కోసం అన్నారు. రాహుల్ గాంధీ దేశం, ప్రజల కోసం చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడం మనందరి బాధ్యత అన్నారు. ఈ భావజాలాన్ని బలహీనపరిస్తే దేశమంతా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఖర్గే.. ఆర్ఎస్ఎస్, బీజేపీలపై కూడా విమర్శలు గుప్పించారు. ఇది రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా నెమ్మదిగా సాగుతోందని, పేదలను తిరిగి బానిసత్వంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఓటు చోరీకి వ్యతిరేకంగా ఐదు కోట్లకు పైగా సంతకాలు 

రాంలీలా మైదానంలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో ఓటు దొంగతనంపై సంతకాలతో కూడిన ఐదు కోట్లకు పైగా సంతకాల కాగితాలను వేదికపై ఉంచారు. కోట్లాది ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోతున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం అధికారాన్ని హస్తగతం చేసుకుని, ప్రజలపై పెత్తనం చెలాయిస్తుందన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Adilabad Latest News: ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget