Telangana Panchayat Election Results: తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ డామినేషన్ - పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ !
Congress party: తెలంగాణ తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక్యత చూపిస్తోంది. బీఆర్ఎస్ వెనుకబడినా.. పోటీ ఇస్తోంది. కొన్ని జిల్లాలో హోరాహోరీగా తలపడుతోంది.

Congress party is showing a lead in the first phase of Telangana Panchayat elections: తెలంగాణలో గ్రామ పంచాయతీలకు జరిగిన తొలి దశ ఎన్నికల్లో ఓటర్లు భారీగా పాల్గొన్నారు. మొత్తం 79 శాతం పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో, మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం, కాంగ్రెస్ మద్దతుదారులు ఆధిక్యంలో ఉండగా, బీఆర్ఎస్ గట్టిపోటీ ఇస్తోంది. ఇతరులు మూడో స్థానంలో ఉండగా.. బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థులు నాలుగో స్థానంలోఉన్నారు.
తెలంగాణలో మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి, ఇందులో తొలి దశలో 4,236 గ్రామాలు, 37,440 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశలో 395 సర్పంచ్‌లు మరియు 9,331 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, దీంతో 3,836 గ్రామాలు ,27,960 వార్డులు కు మాత్రమే పోలింగ్ జరిగింది.
2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి, కౌంటింగ్ ప్రక్రియను అదనపు ఎన్నికల అధికారి, జిల్లా పంచాయతీ-1/3@TelanganaCMO @TelanganaCS @ceotelangana pic.twitter.com/7PVsRQ5CYW
— Collector Mancherial (@Collector_MNCL) December 11, 2025
ఈ దశలో 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు మరియు 65,455 మంది వార్డు సభ్యులు పోటీ పడ్డారు. పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. నల్గొండ, సంగారెడ్డి వంటి ప్రాంతాల్లో స్వల్ప ఘర్షణలు జరిగినప్పటికీ, పోలీసులు త్వరగా నియంత్రించారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగింది.
పెద్దపల్లి, డిసెంబర్ 11:
— Collector Peddapalli (@Collector_PDPL) December 11, 2025
---------------------------------------
🗳️**ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*
🗳️**కౌంటింగ్ ప్రక్రియ ముగియగానే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వర్తించాలి*
🗳️**మొదటి దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ను పరిశీలించిన… pic.twitter.com/arq1nz9spE
ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ట్రెండ్స్ స్పష్టమయ్యాయి. తాజా అప్‌డేట్స్ ప్రకారం, కాంగ్రెస్ మద్దతుదారులు 1,368 స్థానాల్లో సర్పంచ్‌లుగా గెలిచారు. బీఆర్ఎస్ 378, బీజేపీ 81, ఇతరులు 230 స్థానాల్లో గెలిచారు. ఆసిఫాబాద్, నిర్మల్ లోని కొన్ని గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఎన్నికలు జరగలేదు. ఈ ఎన్నికలు పార్టీ ఆధారంగా కాకుండా నిర్వహించినప్పటికీ, రాజకీయ ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయా పార్టీలు బలపరిచిన అభ్యర్థులు అని ప్రచారం చేసుకున్నారు.
2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో హాజీపూర్ మండలంలోని దొనబండ, సబ్బెపల్లి గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, పెద్దంపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాలను-1/4@TelanganaCMO @TelanganaCS pic.twitter.com/z8ZKX3b2qb
— Collector Mancherial (@Collector_MNCL) December 11, 2025





















