Konda Surekha: మంత్రి కొండా సురేఖకు షాక్ - నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ - కేటీఆర్ కేసే కారణం !
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో భాగంగా ఈ NBW జారీ అయింది.

Court issues non-bailable warrant to Minister Konda Surekha : మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యల విషయంలో ప్రజా ప్రతినిధుల కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మంత్రి విచారణకు హాజరు కాలేదు. దాంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు విచారణను ఫిబ్రవరి ఐదో తేదీకి వాయిదా వేసింది.
2024 అక్టోబర్ లో హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలోలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపించారు. అంతేకాకుండా, కేటీఆర్ డ్రగ్స్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు నడుపారని కూడా ఆరపించారు. టాలీవుడ్ నటులు నాగ చైతన్య-సమంతా రూత్ ప్రభు విడాకులకు కేటీఆర్ కారణమని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల్లో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ ను కూడా తీసుకొచ్చి తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఈ వ్యాఖ్యలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఇవి టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఆరోపణలపై కేటీఆర్ మనస్తాపానికి గురయ్యారు. తన 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు తన ప్రతిష్ఠకు, కుటుంబానికి గాయపరిచాయని చెప్పారు. స్నేహితులు, సహచరులు కూడా షాక్ అయ్యారని కేటీఆర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ముదుగా కేటీఆర్ సురేఖకు లీగల్ నోటీస్ పంపారు. బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. సురేఖ స్పందించలేదు. దాంతో కేటీఆర్ హైదరాబాద్ నంపల్లి సిటీ సివిల్ కోర్టులో ప్రైవేట్ క్రిమినల్ డిఫమేషన్ కంప్లైంట్ దాఖలు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 356 (క్రిమినల్ డిఫమేషన్) కింద, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్లు 222, 223 కింద ఈ పిటిషన్లు దాఖలు చేశారు.
వీడియో రికార్డింగ్స్, న్యూస్‌పేపర్ క్లిప్పింగ్స్, హైపర్‌లింక్స్, పెన్ డ్రైవ్ సమర్పించారు. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్ వంటి వారి సాక్ష్యాలను నమోదుచేయించారు. స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ లో కేటీఆర్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. సురేఖకు మరిన్ని డిఫమేటరీ వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్, ఫేస్‌బుక్, గూగుల్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించాలని ఆదేశించింది. కోర్టు ప్రిలిమినరీ ఎవిడెన్స్ సమీక్షించి హైదరాబాద్ పోలీసులకు క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. సురేఖకు ఆగస్టు 21కి నోటీసు ఇవ్వాలని చెప్పింది. కోర్టు అధికారికంగా కాగ్నిజెన్స్ లోకి తీసుకుంది.
సురేఖ వ్యాఖ్యల్లో అక్కినేని ఫ్యామిలీని లింక్ చేయడంతో టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున్ కూడా అక్టోబర్ 2024లో సురేఖపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. సురేఖ నవంబర్ 2025లో బహిరంగ క్షమాపణ చెప్పారు. దీంతో నాగార్జున్ కేసు విత్‌డ్రా చేసుకున్నారు. కానీ కేటీఆర్ కు ఆమె క్షమాపణలు చెప్పలేదు. దాంతో ఆ కేసు కొనసాగుతోంది.





















