అన్వేషించండి

అసెంబ్లీ ఎన్నికలు 2026

(Source:  Poll of Polls)

Revanth Reddy: ప్రాజెక్టుల వద్ద ఉరి తీసినా తప్పు లేదు - రేషన్ కార్డుల పంపిణీ సభలో బీఆర్ఎస్ నేతలపై రేవంత్ ఫైర్

CM Revanth: ప్రాజెక్టుల వద్ద బీఆర్ఎస్ నేతల్ని ఉరి తీసినా తప్పు లేదని సీఎం రేవంత్ అన్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉమ్మడి నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో జరిగింది.

CM Revanth On BRS Leaders:  ఇందిరమ్మ రాజ్యం లో పేదలు సుభిక్షంగా ఉండాలని సన్నబియ్యం ఇచ్చాం.. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొత్త రేషన్ కార్డులను ఇచ్చేందుకు తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. సాయుధ రైతాంగ పోరాటం చేసిన గడ్డ నల్గొండ,తుంగతుర్తి .. నల్గొండ చరిత్ర నే తెలంగాణ చరిత్ర అంటే అతిశయోక్తి కాదన్నారు. 

గ్లాస్ లో సోడా కాదు గోదావరి జలాలు 

నాగార్జున సాగర్,శ్రీశైలం ప్రాజెక్టు ,మూసీ ప్రాజెక్టు కట్టి నల్గొండ రైతులకు నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ..కేసీఆర్ ఉంటే గోదావరి జలాలు మూడు రోజులలో తీసుకు వస్తానని ఒకరు అంటున్నారని.. గ్లాస్ లో సోడా కాదు గోదావరి జలాలు తీసుకురావడానికని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు అధికారం లో ఉన్నపుడు ఎందుకు గోదావరి నీళ్లు తీసుకురాలేదని ప్రశ్నించారు. సొంత మండలానికి ఎంఆర్ ఓ ఆఫీస్ తీసుకురాని సన్నాసి మమల్ని అంటావా అని  మండిపడ్డారు. 10 ఏళ్ళు అధికారం లో ఉన్న బీఆర్ ఎస్ వాళ్లకు రేషన్ కార్డు లు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. 

రైతులకు వేగంగా పథకాల అమలు 

పేదలకు బుక్కెడు బువ్వ పెట్టాలన్న ఆలోచన పదేళ్లు పరిపాలించిన వారికి రాలేదన్నారు. మా ప్రభుత్వం మూడు కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నదని.. బీ ఆర్ ఎస్ హయాం లో గ్రామాల్లో బెల్టుషాప్ లు ఉంటే మా ప్రభుత్వం లో సన్నబియ్యం కోసం జనం బారులు తీరుతున్నారని గుర్తు చేశారు. మా ప్రభుత్వం పైన కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు.. రైతులకు500 రూపాయల బోనస్, సన్నబియ్యం,రైతు భరోసా,రైతు రుణ మాఫీ లాంటి పథకాలు ఇందిరమ్మ రాజ్యం లోనే సాధ్యమయ్యాయన్నారు. 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రైతు రుణ మాఫీ చేసి రుణ విముక్తి కల్పించామన్నారు. రైతు భరోసా ఇవ్వమని బీఆర్ ఎస్ ప్రచారం చేసింది..కానీ 9 రోజులలోనే 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసి వాళ్లలో సంతోషం నింపామని తెలిపారు.  వ్యవసాయం దండుగ కాదు పండుగ చేశాం..2.85 లక్షల ధ్యానం పండించి దేశం లోనే నెంబర్ 1 గా నిలిచామన్నారు. రైతులు సంతోషంగా ఉంటేనే ఇందిరమ్మ ఆత్మ సంతోషం గా ఉంటుంది..సోనియమ్మ కల నెరవేరుతుందని తెలిపారు. 

 5.6 లక్షల మంది కి రేషన్ కార్డులు

కొత్త గా 5.6 లక్షల మంది కి రేషన్ కార్డులు మంజూరు చేశామని సీఎం తెలిపారు. 26 లక్షల మంది పేర్లు కొత్తగా రేషన్ కార్డులలో  నమోదు చేశామన్నారు. 3.10 కోట్లమంది కి సన్నబియ్యం పంపిణీ చేశాం.. 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 2 చీరలు పంపిణీ చేయబోతున్నామని తెలిపారు.  స్వయం సహాయక సంఘాల గ్రూప్ లకు 21 వేల కోట్ల రుణాలను బ్యాంకు ల ద్వారా అందిస్తున్నామని.. ఆర్టీసీ బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నాం..ఇందుకోసం 6500 కోట్ల రూపాయల ఖర్చు చేశామని తెలిపారు. మహిళా సంఘాల లకు బస్ లు కొనిస్తున్నాం.. పెట్రోల్ బంక్ లు ఏర్పాటు చేస్తున్నాం.. సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయించి 1000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కి ఒప్పందం చేసుకుంటున్నామని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో ప్రభుత్వ స్కూల్స్ బాగు చేయించాం..60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దేశం లోనే రికార్డ్ సృష్టించామని గుర్తు చేశారు. 

2 ఏళ్ల లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ 

2 ఏళ్ల లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ లక్ష కోట్ల తో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయింది..60 ఏళ్ల లో కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్,శ్రీశైలం,ఎస్ ఆర్ ఎస్ పీ,జూరాల లాంటి ప్రాజెక్ట్ లు ఎలా ఉన్నాయి? కాళేశ్వరం ఎలా ఉందో చర్చకు సిద్ధమా అని సవాల్ చచేశారు. ప్రాజెక్టుల వద్ద మిమ్మల్ని నీ ఊరి తీసినా పాపం లేదని మండిపడ్డారు.  తుంగతుర్తి కి గోదావరి జలాలు తీసుకువచ్చి తీరుతామని రేవంత్ హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో ఒక గంజాయి మొక్క ఉంది..వచ్చే ఎన్నికల్లో పీకేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తల్ని గెలిపించే బాధ్యత మాదని.. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గొప్ప మెజారిటీ తో పార్టీ ని గెలిపించాలన్నారు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ అధికారం లో ఉంటుంది.. తెలంగాణ గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది..తెలంగాణ ను 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా తీర్చిదిదుతామని భరోసా ఇచ్చారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Congress vs BRS: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
TS SSC Results 2026 District wise Results: తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు
తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు
Husky Dogs: ఖరీదైన హస్కీ కుక్కల్ని పెంచి రోడ్డున వదిలేశారు - కాపాడిన స్వచ్చంద సంస్థలు - ఎవరి పని?
ఖరీదైన హస్కీ కుక్కల్ని పెంచి రోడ్డున వదిలేశారు - కాపాడిన స్వచ్చంద సంస్థలు - ఎవరి పని?
Komatireddy Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు

వీడియోలు

RR vs PBKS IPL 2026 Highlights | రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం
Vaibhav Fun With Kids IPL 2026 | పిల్లలతో వైభవ్ సూర్యవంశీ ఫన్నీ ప్రాంక్
Yashasvi Jaiswal about Vaibhav IPL 2026 | వైభవ్ సూర్యవంశీపై యశస్వి జైస్వాల్ కామెంట్స్
RR vs DC IPL 2026 Suyash Sharma | ఐపీఎల్ చరిత్రలోనే సుయాశ్ శర్మ వరల్డ్ రికార్డ్
RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
Congress vs BRS: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
Dhurandhar Japan Release: జపాన్‌లో రిలీజ్‌కు 'ధురంధర్' రెడీ... జూలైలో ఎప్పుడంటే?
జపాన్‌లో రిలీజ్‌కు 'ధురంధర్' రెడీ... జూలైలో ఎప్పుడంటే?
Komatireddy Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
Delhi High Court: ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
Raghurama: కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
Hormuz: హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
TS SSC Supplementary Exams Date: తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
Embed widget