అన్వేషించండి

Telangana Jagruthi: మహిళా కమిషన్ ఆఫీసు వద్ద తెలంగాణ జాగృతి ఆందోళన, తీన్మార్ మల్లన్నపై చర్యలకు డిమాండ్

MLC Teenmar Mallanna | మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు.

BRS MLC Kavitha | హైదరాబాద్: తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట తెలంగాణ జాగృతి మహిళా నాయకుల ఆందోళనకు దిగారు. ఫిర్యాదు చేయడానికి వస్తే చైర్ పర్సర్ అందుబాటులో లేకపోవడంతో వారు నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ కవితపై, మహిళా లోకంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదు తీసుకునే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని మహిళా కమిషన్ ఆఫీసు ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లా అండ్ ఆర్డర్ ఐజీ రమణ కుమార్ కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆదివారం నాడు ఫిర్యాదు చేశారు.

తీన్మార్ మల్లన్నపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు ఫిర్యాదు చేశారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అందుబాటులో లేకపోవడంతో మహిళా కమిషన్ సభ్యులు సుదం లక్ష్మీ, రేవతి రావు, ఉమ, అప్రోజ్ సహీనాకు ఫిర్యాదు లేఖ ఇచ్చారు. 

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎల్ బీ నగర్ లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద తెలంగాణ జాగృతి, వివిధ కుల సంఘాల నాయకుల నిరసన తెలిపారు. తీన్మార్ మల్లన్నపై ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

Telangana Jagruthi: మహిళా కమిషన్ ఆఫీసు వద్ద తెలంగాణ జాగృతి ఆందోళన, తీన్మార్ మల్లన్నపై చర్యలకు డిమాండ్

తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి..

మేడిపల్లిలోని క్యూ న్యూస్ ఆఫీసుకు వెళ్లి ఆదివారం నాడు తెలంగాణ జాగృతి నేతలు, కార్యకర్తలు హంగామా చేశారు. ఎమ్మెల్సీ కవిత అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహంతో ఊగిపోతూ ఆమె అభిమానులు, జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న ఆఫీసులో దాడులు చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. గన్ మెన్ వద్ద తుపాకీ లాక్కుని కాల్పులు జరపడానికి కార్యకర్తలు యత్నించగా.. వెంటనే వారి వద్ద నుంచి తుపాకీ లాక్కుని తీన్మాన్ మల్లన్న గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపాడు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆగ్రహం వచ్చి ఆఫీసు వద్ద నిరసన తెలిపడానికి వెళ్తే తెలంగాణ జాగృతి నాయకులపై కాల్పులు జరపడం ఏంటని కవిత ప్రశ్నించారు. 

తెలంగాణ జాగృతి కార్యకర్తలు జరిపిన దాడిలో తీన్మార్ మల్లన్న చేతికి స్వల్ప గాయమైంది. కేసీఆర్, కేటీఆర్ మీద ఫ్రస్టేషన్ ఉంటే వారితో తేల్చుకోవాలి కానీ తన మీద దాడులకు రావడం సరికాదన్నారు. తాను చేసిన కంచం, మంచం వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని.. అవి తెలంగాణలో రెగ్యూలర్ గా ఉపయోగించే పదాలే అని తన వ్యాఖ్యలను తీన్మార్ మల్లన్న సమర్థించుకున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
HYD Lover Death: ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
Parakamani case: పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌

వీడియోలు

North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
India vs South Africa T20 Records | మొదటి టీ20లో ఐదు పెద్ద రికార్డులు బ్రేక్‌!
Hardik Record Sixes Against South Africa | హార్దిక్ పాండ్యా సిక్సర్‌ల రికార్డు
Sanju Samson Snubbed For Jitesh Sharma | ఓపెనింగ్ పెయిర్ విషయంలో గంభీర్‌పై విమర్శలు
Shubman Gill Continuous Failures | వరుసగా విఫలమవుతున్న శుబ్మన్ గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
HYD Lover Death: ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
Parakamani case: పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ డే 94 రివ్యూ... కళ్యాణ్ తో కూతురు తీరుపై భరణి అవాక్కయ్యే కామెంట్స్... చచ్చేదాకా చంపుతారా? అంటూ ఒక్కసారిగా బరస్ట్ అయిన సంజన
బిగ్‌బాస్ డే 94 రివ్యూ... కళ్యాణ్ తో కూతురు తీరుపై భరణి అవాక్కయ్యే కామెంట్స్... చచ్చేదాకా చంపుతారా? అంటూ ఒక్కసారిగా బరస్ట్ అయిన సంజన
The Raja Saab Bookings: రాజా సాబ్ ప్లానింగ్ అదుర్స్... అమెరికాలో నెల ముందు!
రాజా సాబ్ ప్లానింగ్ అదుర్స్... అమెరికాలో నెల ముందు!
Diwali In UNESCO Intangible Cultural Heritage List : దీపావళికి అరుదైన గుర్తింపు- యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు, ఏయే పండుగలకు ఘనత లభించింది?
దీపావళికి అరుదైన గుర్తింపు- యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు, ఏయే పండుగలకు ఘనత లభించింది?
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
Embed widget