Old City Metro : పాతబస్తీకి మెట్రో - 8వ తేదీన సీఎం రేవంత్ శంకుస్థాపన
Old City Metro : పాతబస్తీ మెట్రోకు 7వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
CM Revanth Reddy will lay the foundation stone In OldCity Metro on 8th : మార్చి 8వ తేదీన ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 5.5 కిలోమీటర్ల మార్గంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నూమా వరకు ఈ మెట్రో నిర్మాణం ఉంటుంది. ఇందుకోసం సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. పాతబస్తీకి మెట్రో రైలు అనేది సుదీర్గమైన స్వప్నంగా మారింది. ఎన్నో కారణాలతో మెట్రో అక్కడ సాధ్యం కాలేదు. ఎన్నికలకు ముందు మెట్రో విస్తరణ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విభిన్న ప్రణాళికలు వేసింది. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టుకు నిర్మించాని అనుకుంది. పాతబస్తీలో ప్లాన్లు పెండింగ్ లో పడిపోయాయి. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాతబస్తీ మెట్రో ప్రణాళిక ముందుకు కదిలింది.
మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో పాటు పాతబస్తీ ఎమ్మెల్యేలు.. మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌తో రేవంత్ రెడ్డి చర్చించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి హైదరాబాద్(Hyderabad) లోని పాతబస్తీ మెట్రో రైలు(Metro Train) నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్ అయింది. 2012లోనే జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఫలక్‌నూమా వరకు పాతబస్తీ మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసారు. కానీ పలు కారణాల వల్ల ఈ మెట్రో నిర్మాణాన్ని ఎంజీబీఎస్ వరకే ఆపేశారు. పాతబస్తీలో రోడ్డు విస్తరణ చేపట్టడం, నిర్మాణాల కూల్చివేతల వంటి కారణాల వల్ల నిర్మాణ పనుల్లో చాలా ఆలస్యం జరిగింది. డీపీఆర్‌తో పాటు మరికొన్ని పనులు కూడా పూర్తయ్యాయి. కానీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ మెట్రో(L&T Metro) నిర్మాణంపై నిర్లక్ష్యం వహించింది. ఇక చివరకి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ .. పాతబస్తీ మెట్రోపై దృష్టి సారించింది. అంతేకాదు ఈ నిర్మాణం కోసం బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించింది.
ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రాకపోకలు సాగిస్తున్నాయి. అక్కడి నుంచి షిఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజాకోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్‌గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మార్గం ఉంటుంది. ఈ మార్గంలో 5 స్టేషన్లు రాబోతున్నాయి. ఎంజీబీఎస్ దాటిన తర్వాత సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్‌గంజ్, ఫలక్‌నుమా స్టేషన్‌లు ఉంటాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రోను పలు రకాలుగా విస్తరించాలని నిర్ణయించుకుంది. మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు.. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకూ మెట్రోను విస్తరించనున్నారు. వీటికి సంబంధించిన భూమినాణ్యత పరీక్షించేపనులు కూడా ప్రారంభమయ్యాయి.