అన్వేషించండి

Telangana ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.60 లక్షల నుంచి 2 కోట్ల వరకు ప్రమాద బీమా ప్రయోజనం

శాశ్వత, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో కలిపి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపు 10 లక్షల మందికి ఉచిత ప్రమాద జీవిత బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాద బీమా పథకం ప్రారంభించి, బ్యాంకులు అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.
  • శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులందరికీ ఈ ప్రమాద బీమా వర్తిస్తుంది.
  • ప్రమాద మరణానికి 60 లక్షల నుండి 2 కోట్ల పరిహారం.
  • హెల్త్ కార్డుల పంపిణీ, పీఆర్‌సీపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

Accidental Life Insurance Scheme | హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రతిష్టాత్మక 'ప్రమాద జీవిత బీమా పథకాన్ని' గురువారం ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఉద్యోగ సంఘాల సమక్షంలో ఈ పథకం అమలు కోసం 14 ప్రముఖ బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకోనున్నాయి. 

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సైతం బీమా..

మొదట ఈ పథకాన్ని కేవలం శాశ్వత ఉద్యోగులకే పరిమితం చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ తాజాగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వంటి తాత్కాలిక ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు ఖాతాల ద్వారా ప్రభుత్వ శాలరీ అందుకునే ప్రతి ఉద్యోగికీ ఈ బీమా రక్షణ (Employees Insurance) లభిస్తుంది. దాదాపు 10 లక్షల ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించనున్నారు. ఈ బీమా పథకం కోసం ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.

ఏదైనా ప్రమాదంలో ఉద్యోగి మరణిస్తే, ఆ శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంకు ద్వారా నామినీకి రూ. 60 లక్షల నుండి రూ. 2 కోట్ల వరకు బీమా పరిహారం అందుతుంది. పరిహారం మొత్తం ఒక్కో బ్యాంకు నిబంధనలను బట్టి మారుతుందని అధికారులు తెలిపారు. కొన్ని బ్యాంకులు రూ. 60 లక్షల నుండి రూ.1 కోటి వరకు ఇస్తామని అంగీకరించగా, ఎక్కువ వేతన ఖాతాలు కలిగిన బ్యాంకులు రూ. కోటి ఇవ్వనున్నాయి. ఒకవేళ విమాన ప్రమాదంలో ఉద్యోగి మరణిస్తే గరిష్టంగా రూ. 2 కోట్ల వరకు ఉద్యోగి నామినీకి పరిహారం లభిస్తుంది. 

Also Read: Kalvakuntla Kavitha Attacks Pawan Kalyan: పవన్ కల్యాణే టార్గెట్‌గా కల్వకుంట్ల కవిత రాజకీయం! తెలంగాణలో ప్రభావం లేని జనసేనానిపై యుద్ధం వెనుక అసలు వ్యూహం ఇదేనా?

గతంలో సింగరేణి ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఇప్పటికే 45 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున పరిహారం అందింది. దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం తెలంగాణలో ఈ తరహా పథకాన్ని అమలు చేస్తోంది. సాధారణ మరణాలకు పరిహారం ఇచ్చే అంశంపై బ్యాంకులు ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి ఉద్యోగులందరూ తమ గుర్తింపు కార్డులతో పెద్ద ఎత్తున తరలిరావాలని టీఎన్‌జీవో (TNGO) పిలుపునిచ్చింది.

మరోవైపు, ఉద్యోగులకు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని త్వరగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జూలై మొదటి వారంలో ఎల్బీ స్టేడియంలో దాదాపు 50 వేల మంది ఉద్యోగులతో భారీ బహిరంగ సభ నిర్వహించి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్డులను పంపిణీ చేయాలని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. దీంతో పాటు, ఉద్యోగుల వేతన సవరణ సంఘం (PRC) అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. పీఆర్‌సీ అమలు చేస్తే ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారం ఎంత ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు ప్రస్తుతం లెక్కలు సిద్ధం చేస్తున్నారు.

Frequently Asked Questions

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనున్న కొత్త పథకం ఏమిటి?

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల కోసం 'ప్రమాద జీవిత బీమా పథకాన్ని' ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్రభారతిలో దీన్ని ప్రారంభిస్తారు.

ప్రమాద జీవిత బీమా పథకం ఎవరికి వర్తిస్తుంది?

శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వంటి తాత్కాలిక ఉద్యోగులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. బ్యాంక్ ఖాతా ద్వారా జీతం పొందే ప్రతి ఉద్యోగికి బీమా రక్షణ లభిస్తుంది.

ఈ బీమా పథకం కింద ఎంత పరిహారం లభిస్తుంది?

ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే రూ. 60 లక్షల నుండి రూ. 2 కోట్ల వరకు బీమా పరిహారం లభిస్తుంది. విమాన ప్రమాదాల్లో గరిష్టంగా రూ. 2 కోట్లు అందుతుంది.

ఉద్యోగులు ఈ బీమా కోసం ప్రీమియం చెల్లించాలా?

లేదు, ఈ బీమా పథకం కోసం ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ప్రభుత్వం అందించే పథకం.

ఈ ప్రమాద బీమా పథకం యొక్క ప్రత్యేకత ఏమిటి?

దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం తెలంగాణలో ఈ తరహా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇది సుమారు 10 లక్షల ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Telangana Politics: రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget