అన్వేషించండి

ACB Raids: మరో తిమింగలంపై ఏసీబీ వల - నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి ఇళ్లపై మెరుపు దాడులు

ACB raids : నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. మల్లా రెడ్డి ఇళ్లపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేశారు. హైదరాబాద్, నిజామాబాద్ సహా 11 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

Telangana anti corruption bureau latest raids 2026:  తెలంగాణలో అవినీతి తిమింగలాల వేటను యాంటీ కరప్షన్ బ్యూరో మరింత ఉధృతం చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే నమ్మదగిన సమాచారంతో నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్  కె. మల్లా రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం ఏకకాలంలో మెరుపు దాడులు ప్రారంభించారు.  

 11 బృందాలతో ఏకకాలంలో దాడులు.. 

మల్లా రెడ్డి అక్రమాస్తుల గుట్టు రట్టు చేసేందుకు ఏసీబీ ఏకంగా 11 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. హైదరాబాద్‌లోని మాచ బొల్లారంలో ఉన్న ఆయన నివాసంతో పాటు నిజామాబాద్‌లోని ఆయన కార్యాలయం, నివాసాలపై అధికారులు విరుచుకుపడ్డారు. వీటితో పాటు మల్లా రెడ్డికి అత్యంత ఆప్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలుగా అనుమానిస్తున్న వారి ఇళ్లు, వ్యాపార సంస్థల్లోనూ ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

 ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు.. 

తన అధికారిక ఆదాయ వనరులకు మించి మల్లా రెడ్డి భారీగా ఆస్తులను కూడబెట్టారనే బలమైన ఆరోపణలు, ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ ఈ కేసు నమోదు చేసింది. ప్రాథమిక దర్యాప్తులో ఆయన పెద్ద ఎత్తున అక్రమ సంపాదనకు పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో, కోర్టు అనుమతితో ఈ సర్ప్రైజ్ రైడ్స్ ప్లాన్ చేశారు. సోదాల సందర్భంగా అధికారులు ల్యాండ్‌ డాక్యుమెంట్లు, బ్యాంక్ పాస్‌బుక్కులు, బంగారు ఆభరణాలు, భారీగా నగదును గుర్తించినట్లు తెలుస్తోంది.   

 ఆర్థిక రికార్డులు, డాక్యుమెంట్ల పరిశీలన.. 

ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ, ల్యాండ్ డాక్యుమెంట్లు, బ్యాంకు లాకర్ల వివరాలు మరియు ఇతర ఆర్థిక లావాదేవీల రికార్డులను ఏసీబీ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. మల్లా రెడ్డి సర్వీస్ కాలంలో సంపాదించిన చట్టబద్ధమైన ఆదాయానికి, ప్రస్తుతం దొరికిన ఆస్తుల విలువకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని లెక్కగట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

 అధికార వర్గాల్లో తీవ్ర కలకలం..                                 

ఒక కీలక జిల్లాకు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న అధికారి నివాసాలపై ఈ స్థాయిలో ఏసీబీ దాడులు జరగడం కలకలం రేపుతోంది. సోదాలు పూర్తిగా ముగిసిన తర్వాత మల్లా రెడ్డి అక్రమాస్తుల అసలు విలువ ఎంత? ఎక్కడెక్కడ బినామీల పేర్లతో ఆస్తులు కొనుగోలు చేశారు? అనే పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు. అక్రమాలు రుజువైతే ఆయనపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.            

టాప్ హెడ్ లైన్స్

Kavya Maran and Anirudh Wedding: కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
CM Revanth Reddy: హైదరాబాద్‌లో హ్యుందాయ్ ఆర్‌ అండ్ డీ కేంద్రం.. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు భేటీ!
హైదరాబాద్‌లో హ్యుందాయ్ ఆర్‌ అండ్ డీ కేంద్రం.. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు భేటీ!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Embed widget