అన్వేషించండి

Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్

మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, సిద్దిపేటలో గెలిచే కాంగ్రెస్ అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. Harish Rao కు చెక్ పెట్టడంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Siddipet Latest News | సిద్దిపేట: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటన సందర్భంగా సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను మంత్రిని చేస్తామన్నారు. ఈ బాధ్యతను పెద్దలు దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకట స్వామి  తీసుకుంటారని నేను ఈ వేదిక మీద నుంచి రేవంత్ మాటిచ్చారు. 2029 ఎన్నికలలో సిద్దిపేటలో గెలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యేను వారు మంత్రిని చేస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 2014, 2018 సంవత్సరాల్లో కూడా మేము పోటీ పడ్డాం. ఆనాడు ప్రజలు మీకు (బీఆర్ఎస్ పార్టీకి) అధికారం ఇచ్చారు. కానీ 2023లో మీరు మేము పోటీ పడ్డప్పుడు ప్రజలు అధికారం మాకు ఇచ్చారు. అలాగే 2029లో కూడా ప్రజలు మాకే  అవకాశం ఇస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో జరిగిన భారీ బహిరంగసభలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హరీష్ రావును వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ నేతలు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నారు అనడానికి రేవంత్ మంత్రి పదవి ఆఫరే అందుకు నిదర్శనం.

సిద్దిపేటలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. సీఎం రేవంత్ రెడ్డి
‘సిద్దిపేట ప్రాంతంలో 1984 నుంచి 2029 వరకు ఒకే కుటుంబం అధికారంలో ఉంది. కనుక ఈసారి ఇతరులకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని నేను కోరుతున్నాను. నాయకత్వంలో మార్పు చేసి చూడండి. మీకు ఎంత మంచి జరుగుతుందో లేదో మీకే తెలుస్తుంది. ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతులు. కనుక వచ్చే ఎన్నికల్లో విచక్షణతో ఆలోచన చేయాలని కోరుతున్నాను
ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంటుంది. మల్లన్న సాగర్ సమస్య లేదా ఇతర సాగునీటి ప్రాజెక్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. గతంలో మల్లన్న సాగర్ సమయంలో ఏటిగడ్డ కిష్టాపూర్లో నేను 48 గంటల పాటు దీక్ష చేశాను. ఆనాడు రైతుల పక్షాన నిలబడటానికి దామోదర్ రాజనరసింహ, రఘునందన్ రావు కూడా వచ్చారని’ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.

సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులు 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం (మార్చి 22న) సిద్ధిపేట జిల్లా పర్యటనలో భాగంగా నంగునూరు మండలం నర్మెట్టలో రూ. 300 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన పామ్ ఆయిల్ కర్మాగారాన్ని ఆయన ప్రారంభించి, రాష్ట్ర రైతులకు అంకితం చేశారు. దీనికి అదనంగా రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా నిధులను విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం రూ. 775.72 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన మంత్రులతో కలిసి శ్రీకారం చుట్టారు.

సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలో విద్యా, వైద్య, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ రేవంత్ రెడ్డి పలు కీలక భవనాలను ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా రూ. 141.34 కోట్లతో సిద్ధిపేట మున్సిపాలిటీలో చేపట్టిన నీటి సరఫరా మరియు భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే ఎన్సాన్‌పల్లిలో రూ. 78 కోట్లతో నిర్మించిన జిల్లా జైలు భవనం, రూ. 15 కోట్లతో ఏర్పాటు చేసిన 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రిని ఆయన జాతికి అంకితం చేశారు. ఇవే కాకుండా సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌తో పాటు నంగునూరు, అంబేద్కర్ నగర్‌లలో కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాలను కూడా సీఎం ప్రారంభించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget