అన్వేషించండి

CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

Oil Palm Factory in siddipet | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పాం ఫ్యాక్టరీతో పాటు మొత్తం 775 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు.

సిద్దిపేట: ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం (మార్చి 22న) సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో పర్యటించారు. అక్కడ రూ. 300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితం చేశారు. దీనితో పాటు రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం రూ. 775.72 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన మంత్రులతో కలిసి శ్రీకారం చుట్టారు.

సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..

సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలో విద్యా, వైద్య, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ పలు భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో రూ. 141.34 కోట్లతో సిద్ధిపేట మున్సిపాలిటీలో నీటి సరఫరా, డ్రైనేజీ ప్రాజెక్టులు, రూ. 78 కోట్లతో ఎన్సాన్‌పల్లిలో జిల్లా జైలు భవనం, రూ. 15 కోట్లతో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రి ముఖ్యమైనవి ఉన్నాయి. వీటితో పాటు సెంట్రల్ మెడిసిన్ స్టోర్, నంగునూరు, అంబేద్కర్ నగర్‌లలో కొత్త పిహెచ్‌సి (PHC) భవనాలను జాతికి అంకితం చేశారు.

గజ్వేల్ నియోజకవర్గంలో కూడా భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. ముఖ్యంగా కొండపాకలో రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునాది రాయి వేశారు. మర్కూక్ మరియు జగదేవ్‌పూర్ మండలాల్లో నూతనంగా నిర్మించిన సమీకృత మండల కార్యాలయాల సముదాయాలను (IOC) ప్రారంభించడంతో పాటు, మర్కూక్ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించారు.

అన్నగా బాధ్యత తీసుకున్నాను.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా అన్నారు. 70 లక్షల మంది రైతన్నలకు పంట పెట్టుబడి సాయంగా రూ.9000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదల నేడు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నామని రేవంత్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆర్ధిక సాయంతో చేతులు దులుపుకోవడం మాత్రం కాదు… కేవలం 17 నెలల వ్యవధిలో పామ్ ఆయిల్ పరిశ్రమ మొదలు పెట్టి, పూర్తి చేసి నేడు రైతులకు అంకితం చేస్తున్నామని పోస్ట్ చేశారు. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్ కు నర్మెట్టలో శంకుస్థాపన చేస్తున్నాం అని ఆదివారం ఆయన చేసిన పోస్ట్ వైరల్ అయింది..

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Letter to Revanth Reddy: పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
Harish Rao Milchy Milk Controversy: హరీష్ రావు చుట్టూ ముదురుతున్న పాల రాజకీయం - మిల్చీమిల్క్‌పై సమాధానం చెప్పలేరా?
హరీష్ రావు చుట్టూ ముదురుతున్న పాల రాజకీయం - మిల్చీమిల్క్‌పై సమాధానం చెప్పలేరా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Embed widget