అన్వేషించండి

Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ

Telangana CM Revanth Reddy | సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదలకు శ్రీకారం చుట్టారు. ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమవుతాయి.

తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను అధికారికంగా విడుదల చేశారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించింది. 70 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే 45 రోజుల్లోగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.

గత కొంతకాలంగా పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో, ఆర్థిక ఇబ్బందులు లేకుండా రైతులు తమ పంటలను సాగు చేసుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి 300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. మొత్తం 775 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకట్ స్వామి, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.

3,600 కోట్లు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ‘సన్న బియ్యానికి రూ.500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మాది. ఇప్పుడు రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధుల విడుదలకు శ్రీకారం చుట్టాం. తొలి విడతగా 70 లక్షల మంది రైతులకు రూ.3600 కోట్లు ప్రయోజనం చేకూరనుంది. రేపటిలోగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయి. మిగిలిన 5400 కోట్ల రూపాయల్లో 20 రోజుల్లో 2700 కోట్లు, ఇంకో 20 రోజుల్లో 2700 కోట్లు రైతుల ఖాతాలో ఎకరానికి రూ.6000 చొప్పున మొత్తం 9000 కోట్లు రైతు భరోసా నగదు జమ చేస్తాం. మొత్తం 45 రోజుల్లోగా ప్రక్రియ పూర్తవుతుందని’ అన్నారు.

తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులను ఎలాంటి ఆటంకాలు లేకుండా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి (DBT) చేరుస్తున్నామని స్పష్టం చేశారు. ఈ రూ. 9,000 కోట్ల విడుదల ద్వారా రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా మేలు చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న లోపాలను సవరించి, అర్హులైన ప్రతి రైతుకు ఈ సాయం అందేలా పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిధుల జమ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు.

‘బీఆర్ఎస్ హయాంలో 114 నెలలు సీఎం కేసీఆర్ రైతులకు సరాసరి ఖర్చు 2533 కోట్లు. నేడు మన ప్రభుత్వం 28 నెలలైతే ప్రతినెల సరాసరి రూ.5500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ రైతులకు ఉచిత విద్యుత్, సన్నవడ్లకు బోనస్, రుణమాఫీ, రైతు భీమా, రైతు భరోసా లాంటి వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుకు వేయకుండా ఖర్చు చేస్తున్నాం. ఇప్పటివరకూ రైతులకు లక్షా 30 వేల కోట్లకు పైగా రైతు సంక్షేమం కోసం ఖర్చుపెట్టాం.

వరి పండించడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది 2.58 కోట్ల మెట్రిక్ టన్నులతో నెంబర్ వన్‌గా నిలిచాం. మెదక్, నిజామాబాద్ రైతులకు ఓ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో నిజాం ఫ్యాక్టరీ నడిచింది. పసుపు, మొక్కజొన్నలు, చెరుకు లాంటివి గతంలో బాగా పండించారు. ఇప్పుడు పామాయిల్ పంట 3 లక్షల ఎకరాలకు చేరింది. 10 లక్షల ఎకరాలకు పండించినా కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 

పంట మార్పిడి చేయాల్సిన అవసరం వచ్చింది..

ఖమ్మం, వరంగల్ జిల్లాలో పత్తి, మిర్చి బాగా పండుతుంది. నల్గొండలో వడ్లతో పాటు కొన్ని రకాల కందులు పండుతాయి. మహబూబ్ నగర్‌లో పచ్చ జొన్నలు, సజ్జలు, కందులు, దోసకాయ పంటలు వస్తాయి. రంగారెడ్డిలో భారతదేశానికే కందిపప్పు పండిస్తున్నారు. పాలకూర, కొతిమిర, మెంతి కూర, ద్రాక్ష తోటలు ఉండేవి. ఆర్టీసీలో పాలక్యాన్లు, కూరగాయలు, ఆకుకూరలతో వచ్చేవారు. పండ్ల తోటలు రియల్ ఎస్టేట్ లే అవుట్లు అయ్యాయి. పాలు, కోడిగుడ్లు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటన్నాం. రైతులలో పంట మార్పిడి గురించి అవగాహనా పెంచాలని తుమ్మల నాగేశ్వరరావుకు సూచిస్తున్నాం. కేంద్రం 50 లక్షల మెట్రిక్ టన్నుల వరకే కొంటామని చెప్పింది. కానీ ఈ ఏడాది మనం ఇప్పటికే 75 లక్షల మెట్రిక్ టన్నుల వరకు రాష్ట్రం కొనుగోలు చేసింది.  ఎగుమతి చేయాలన్నా గిట్టుబాటు ధర లేదు. కనుక రైతులు పంట మార్పిడి చేస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుంది. - రేవంత్ రెడ్డి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Kadem Forest Missing Farmer: అడవిలోకి వెళ్లిన గేదెలు వచ్చాయి కానీ పశువుల కాపరి మాత్రం రాలేదు - అడవిలో తప్పిపోయిన వృద్ధ రైతు - డ్రోన్లతో పోలీసుల ముమ్మర గాలింపు!
అడవిలోకి వెళ్లిన గేదెలు వచ్చాయి కానీ పశువుల కాపరి మాత్రం రాలేదు - డ్రోన్లతో కడెం పోలీసుల ముమ్మర గాలింపు!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Breaking News: ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే భోగాపురం ఎయిర్ పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే భోగాపురం ఎయిర్ పోర్ట్: ప్రధాని మోదీ
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget