అన్వేషించండి

CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!

Revanth Reddy Challenge KCR: భద్రాచలం రాముడిపై ఒట్టేసి చెబుతున్నా 2029లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది.., కాంగ్రెస్సే గెలుస్తుందని రేవంత్ ప్రకటించారు.

Revanth Reddy Predicts 182 Assembly Seats Telangana:    తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మరోసారి అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించిన కాంగ్రెస్  రైతు ఆశీర్వాద సభ  బహిరంగ సభ వేదికగా ఆయన బీఆర్‌ఎ అధినేత కేసీఆర్ కుటుంబానికి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి శాశ్వతంగా పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ సైనికులు, కార్యకర్తలు నిద్రపోరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.  కాచుకో కేసీఆర్.. నీ బలగమంతా ఈ మాట గుర్తుపెట్టుకోండి. భద్రాచలం సీతారామచంద్రస్వామి సాక్షిగా ఒట్టేసి చెబుతున్నా.. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాం  అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
 
 2029 జూన్‌లో ఎన్నికలు.. 182 అసెంబ్లీ స్థానాలు! 

సరికొత్త జాతీయ రాజకీయ సమీకరణాలను తెరపైకి తెస్తూ రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా జరగబోయే జమిలి ఎన్నికల ప్రణాళికపై క్లారిటీ ఇచ్చారు. దేశంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆప్   వంటి ప్రాంతీయ పార్టీలను చీల్చడానికి కేంద్రంలోని బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రం అనుకున్న బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించుకునే కుట్రల్లో భాగంగా.. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ  బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య భారీగా పెరగనుందని, 2029 మే లేదా జూన్ నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి సరికొత్త రీతిలో ఎన్నికలు జరుగుతాయని ఆయన అంచనా వేశారు. పునర్వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 26కు, అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయని సీఎం సరికొత్త లెక్కలను ప్రకటించారు.
  
 పెరిగే స్థానాల్లో 117 సీట్లు కాంగ్రెస్‌వే 

రాబోయే ముందస్తు రాజకీయ ముఖచిత్రంలో పెరిగే 182 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే 117 స్థానాలను కైవసం చేసుకుని మళ్లీ ప్రభంజనం సృష్టిస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను చెప్పిన రాజకీయ జోస్యం ఎలా ఫలించిందో ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా నేను ఇలానే జోస్యం చెప్పాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 65 సీట్లతో అధికారంలోకి వస్తుందని స్పష్టంగా ప్రకటించాను. మేము అనుకున్నట్లుగానే నాడు 64 సీట్లు సాధించి ఇక్కడ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు అదే నమ్మకంతో ఖమ్మం గడ్డ పైనుంచి జోస్యం చెబుతున్నా.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 117 సీట్లు గెలవడం ఖాయం  అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
 
 కేసీఆర్ టార్గెట్‌గా కౌంటర్లు 

జగన్నాథపురం సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అటు లీడర్లలో, ఇటు సోషల్ మీడియా వేదికలపై పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా భద్రాచలం రాముడిపై ఒట్టేసి కేసీఆర్‌కు సవాల్ విసరడం, 2029 నాటికి తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 182కు పెరుగుతాయని కాన్ఫిడెంట్‌గా చెప్పడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.   రైతు భరోసా నిధులు రూ. 1009 కోట్లు విడుదల సందర్భంగా జరిగిన ఈ రైతు ఆశీర్వాద సభ  కేవలం ప్రభుత్వ కార్యక్రమంగానే కాకుండా, రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలకు వేదికగా మారింది. కేసీఆర్ ఫ్యామిలీని, బీఆర్‌ఎస్ శ్రేణులను పూర్తిగా నిరుత్సాహపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ప్రసంగం చేశారు. నియోజకవర్గాల విభజన బిల్లుపై కేంద్రం అడుగులు, 26 ఎంపీ స్థానాల పెంపు వంటి జాతీయాంశాలను రేవంత్ ప్రస్తావించడంతో.. రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget