అన్వేషించండి

Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!

Telangana BJP: తెలంగాణలో పార్టీని సెట్‌రైట్ చేసి ఇతర పార్టీల నుంచి నేతలను ఆహ్వనించేందుకు బీజేపీ సిద్ధమైంది. అందుకే ఢిల్లీ నుంచి అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి, వచ్చే ఎన్నికలే లక్ష్యంగా.
  • కేంద్ర పెద్దలు తరచుగా పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు.
  • నడ్డా ఐక్యత, కొత్త చేరికలు కోరారు, విపక్షాలపై విమర్శలు.
  • ఢిల్లీ నేతల ఒత్తిడి ఉన్నా, అంతర్గత కలహాలు సవాల్‌గా.

Telangana BJP: పశ్చిమ బెంగాల్‌ ప్లాన్ వర్కౌట్ అవ్వడం, అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఫోకస్ ఇప్పుడు తెలంగాణపై పడింది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా సరే రెండేళ్ల తర్వాత వచ్చే తెలంగాణ ఎన్నికలపై వ్యూహాలు రచిస్తోంది కమల దళం. ఇప్పటి నుంచే గ్రౌండ్‌ను ప్రిపేర్ చేస్తోంది. అందుకే ఈ మధ్య కాలంలో ఢిల్లీ పెద్దలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. లీడర్‌లను కేడర్‌ను సన్నద్ధం చేస్తున్నారు. బయట పార్టీ నుంచి భారీగా చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 

తెలంగాణలో అధికారంలోకి రావడానికి నౌ ఆర్ నెవర్ అనే రీతిలో బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణపై కాషాయదళం ఎంత ఫోకస్డ్‌గా ఉందో అర్థమవుతోంది. మేలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొన్ని రోజుల గ్యాప్ ఇచ్చి జూన్‌లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటించారు. మూడురోజుల పాటు ఇక్కడే ఉంటూ లీడర్లకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎలా సన్నద్ధంగా ఉండాలో కూడా తెలియజేశారు. 

తాజాగా కేంద్రమంత్రి జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించారు. ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కీలక నేతలతో సమావేమయ్యారు. ఎన్నికలకు సన్నద్ధం కావాలని, విభేదాలు లేకుండా పార్టీ విజయం కోసం ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. అంతేకాకుండా ఆయన మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఆ కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి. 

చాలా మంది ఇతర పార్టీల నేతలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వారి కోసం డోర్లు ఓపెన్ చేయాలని నడ్డా లీడర్లకు సూచించారు. ఇప్పటికే పార్టీ ప్రజల్లో బలంగా ఉందని ఇతర పార్టీల నుంచి వచ్చే వారితో అధికారం దిశగా సాగుతుందని చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు పార్టీలో ఉన్న కీలక నేతలంతా విభేదాలను పక్కన పెట్టి పార్టీ విజయం కోసం పని చేయాలని హితవుపలికారు. సమన్వయంతో ముందుకెళ్తేనే పార్టీకి మేలు జరుగుతుందని అన్నారు. 

కొత్తవారు వచ్చిన తర్వాత వారిని కూడా సమన్వయం చేసుకొని నిత్యం ప్రజలు ఉండాలని నడ్డా సూచించారు. కష్టపడే వారికే గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఎప్పటికప్పుడు ఇక్కడి విషయాలను ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా తెలుసుకుంటున్నారని అన్నారు. కచ్చితంగా న్యాయం చేస్తారని అన్నారు. ప్రజలు, కార్యకర్తలతో కలిసి ఉంటనే నేతలకు విజయం వరిస్తుందని లేకుంటే డిస్‌కనెక్ట్‌ అవుతారని హెచ్చరించారు. 

పార్టీ నేతలకు చిన్న క్లాస్ తీసుకున్న నడ్డా, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. పదేళ్లు న్యాయం జరగలేదని కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అ పార్టీ మరింత ముంచేసిందని ఆరోపించారు. అందుకే ఆ రెండు పార్టీల నుంచి భారీ సంఖ్యలో నేతలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఇప్పుడు మరికొందరు మంత్రులు, కీలక నేతలు వారనికో పదిహేను రోజులకో ఒకసారి తెలంగాణను టచ్ చేసి వెళ్తారని సమాచారం. ఇప్పుడు బీజేపీలో ఉన్న నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడటం లేదు. ముందు వారిని ఒక దారిలో పెట్టి తర్వాత డోర్స్ తెరవాలని బీజేపీ చూస్తోంది. అందుకే ఢిల్లీ నుంచి నేతలు వచ్చి లీడర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయినా వారంతా ఏకదాటిపైకి వచ్చేందుకు ససేమిరా అంటున్నారు. 

Frequently Asked Questions

తెలంగాణపై బీజేపీ దృష్టి ఎందుకు పెట్టింది?

పశ్చిమ బెంగాల్‌లో విజయం తర్వాత బీజేపీ తెలంగాణపై దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తూ, 'నౌ ఆర్ నెవర్' అనే పద్ధతిలో ప్రయత్నాలు ప్రారంభించింది.

ఇటీవల తెలంగాణలో పర్యటించిన బీజేపీ అగ్ర నాయకులు ఎవరు?

మేలో ప్రధాని నరేంద్ర మోదీ, జూన్‌లో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఇటీవల కేంద్రమంత్రి జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించారు. వీరు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

జేపీ నడ్డా తెలంగాణ బీజేపీ నాయకులకు ఇచ్చిన కీలక సూచనలు ఏమిటి?

విభేదాలు వీడి పార్టీ విజయం కోసం పని చేయాలని, ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు స్వాగతం పలకాలని నడ్డా సూచించారు. ప్రజలతో కలిసి ఉండాలని కూడా ఆయన చెప్పారు.

ఇతర పార్టీల నేతలు బీజేపీలోకి చేరడానికి ఎందుకు ఆసక్తి చూపుతున్నారు?

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని జేపీ నడ్డా అన్నారు. ఈ రెండు పార్టీల నుంచి భారీ సంఖ్యలో నేతలు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.

తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం ఉన్న అంతర్గత సమస్యలు ఏమిటి?

తెలంగాణ బీజేపీ నేతల మధ్య విభేదాలు ఉన్నాయని, ఒకరంటే ఒకరికి పడటం లేదని సమాచారం. ఈ సమస్యలను పరిష్కరించి, నేతలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఢిల్లీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
YSRCP Regional Politics AP: వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
Nara Lokesh Praises Pawan Kalyan : పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget