KCR Letter To Modi : ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల కోసం అదనపు సీట్లు - ప్రధానికి కేసీఆర్ లేఖ !
ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు అదనపు సీట్లు కేటాయించాలని సీఎం కేసీఆర్... ప్రధాని మోదీకి లేఖ రాశారు. వారికి అయ్యే ఖర్చంతా తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందన్నారు.
ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థు విషయంలో జోక్యం చేసుకుని ఆదుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ( TS CM KCR ) ప్రధాని మోదీకి ( PM MODI ) లేఖ రాశారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారి వైద్య విద్య కొనసాగాలని, ఈ మేరకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. వైద్య కళాశాలల్లో ఉక్రెయిన్ విద్యార్థుల కోసం అదనంగా సీట్లు పెంచాలన్నారు. ఉక్రెయిన్ (Ukraine ) నుంచి 700 మంది వైద్య విద్యార్థులు తెలంగాణకు వచ్చారనికి లేఖలో తెలిపారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థుల ( Medical Student ) ప్రభుత్వం భరిస్తుందని లేఖలో సీఎం పేర్కొన్నారు. మానవ తాదృక్పథంతో త్వరగా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్, రెగ్యులరైజేషన్ కు ఆర్థికశాఖ కసరత్తు
ఉక్రెయిన్ నుంచి 20 వేల మంది విద్యార్థులు ఇండియాకు ( India ) తిరిగి వచ్చారని, వీరిలో దాదాపు అందరూ మెడికల్ విద్యార్థులే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ వార్ కారణంగా.. విద్యార్థులు తమ విద్యాసంవత్సరాన్ని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ( Students) ఆదుకోవాలని కోరారు. ఇటీవల అసెంబ్లీలోప్రసంగించిన కేసీఆర్.. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల చదువులను భరిస్తామని ప్రకటించారు. అయితే వారి చదువు కొనసాగింపు ఇప్పుడు కష్టంగా మారింది. యుద్ధం ముగిసినా మళ్లీ ఉక్రెయిన్‌కు వెళ్లి చదువుకునే పరిస్థితులు ఉండవు. ఈ కారణగా ఎక్కువ మంది ఇక్కడే విద్యను కొనసాగించాలని భావిస్తున్నారు. కానీ వారికి సీట్లు ( Medical Seats ) అందుబాటులో ఉండవు.
గాంధీ భవన్ కాదది కుస్తీ భవన్- కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్ విసుర్లు
ఈ సమస్య ఒక్క తెలంగాణది ( Telangana (మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వారందరిదీ సమస్యే. వారంతా వివిధ సెమిస్టర్లలో ఉన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ కాలేజీలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. కానీ వైద్య విద్యలో ప్రాక్టికల్స్ ( Medical Practicals ) ముఖ్యం. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో ఒకటి చేయాలన్న డి్మాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవల ఏపీ సీఎం జగన్ కూడా... ఉక్రెయిన్ విద్యార్థులు తనను కలిసినప్పుడు.. వారి చదువు కొనసాగింపుపై ప్రధాని మోదీకి లేఖ రాస్తానని తెలిపారు. కేసీఆర్ లేఖపై కేంద్రం ( Central Governament ) స్పందిస్తే ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వారి కష్టాలు తిరినట్లేనని అనుకోవచ్చు.