అన్వేషించండి

TS Contract Employees : కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్, రెగ్యులరైజేషన్ కు ఆర్థికశాఖ కసరత్తు

TS Contract Employees : కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు తెలంగాణ ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఉద్యోగుల వివరాలు పంపాలని ఆయా శాఖలను ఆదేశించింది.

TS Contract Employees : కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యుల‌రైజేష‌న్ కు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు ఆర్థిక శాఖ అనుమతులు జారీచేసింది. 2016లో విడుదల చేసిన జీవో 16 ప్రకారం అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు పంపాలని ఆయా శాఖలను ఆర్థికశాఖ కోరింది. ఈ పోస్టుల్లో రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగుణంగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని ఆర్థిక శాఖ తెలిపింది. వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని సూచించింది. రాష్ట్రంలో ఉన్న 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. 

సీఎం కేసీఆర్ ప్రకటనతో 

కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ దిశగా రాష్ట్ర సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. 80 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లతో పాటు 11 వేలకు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా ఆర్థికశాఖ కసరత్తు చేస్తుంది. అర్హులైన ఒప్పంద ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలను ఆర్థికశాఖ ఆదేశించింది. ఫిబ్రవరి 26, 2016లో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పట్లోనే ఓ మెమో కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత కొందరు రెగ్యులరైజేషన్ ప్రక్రియపై కోర్టుకు వెళ్లడంతో 2017లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులుతో క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ మధ్యంతర ఉత్తర్వులను 2021 డిసెంబర్ 7న హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీఎం కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలను ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కోరారు. ఆర్థికశాఖ పరిశీలన, ఆమోదం కోసం వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని ఆయన పేర్కొన్నారు. 

కోర్టు కేసులతో వాయిదా 

తెలంగాణ ఏర్పాటైన కొత్తలోనే 2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది. కానీ కోర్టు కేసులతో ఈ నిర్ణయం వాయిదా పడుతూవచ్చింది. గతేడాది డిసెంబరు 7న ఈ కేసులను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసేందుకు తాజా నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకాలుండవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకే ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

టాప్ హెడ్ లైన్స్

PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
TPCC Chief Mahesh Kumar Goud: సీఎం రేవంత్‌తో విభేదాల్లేవు, కానీ కొండా సురేఖ విషయం బాధించింది: మహేష్ కుమార్ గౌడ్
సీఎం రేవంత్‌తో విభేదాల్లేవు, కానీ కొండా సురేఖ విషయం బాధించింది: మహేష్ కుమార్ గౌడ్
Live Murder in Hyderabad: నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Rishabh Pant News: పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
BRS Leaders Arrest: కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
రూ.65 వేల నుంచి లక్ష ధరలో హోండా టూవీలర్స్‌.. షైన్‌, యాక్టివ్‌, డియో, లివో మోడళ్లు
రూ.లక్ష లోపే కొనగలిగే హోండా బైక్ లేదా స్కూటర్.. మీ కోసం 10 రకాల టూవీలర్లు
Embed widget