అన్వేషించండి

Breaking News Live: ఏప్రిల్ 11న ఏపీ మంత్రి వర్గ విస్తరణ  

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: ఏప్రిల్ 11న ఏపీ మంత్రి వర్గ విస్తరణ  

Background

పొడి గాలులు పెరగడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. గత మూడు రోజులుగా మధ్యాహ్నం సమయంలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేటి 41 నుంచి 45 డీగ్రీల మధ్యలో ఎండలు ఉంటాయని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీలో కడప​, కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ వడగాలులు వీచే అవకాశం ఉంది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 వరకు నమోదు కానున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ కొన్నిచోట్ల ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ఎండలు ఎక్కువగా ఉన్న జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..
ఏపీలోకి ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం పొడిగా మారింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అత్యధికంగా జంగమేశ్వరపురంలో 37.1 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఉక్కపోత, తేమ ప్రభావం అధికం కావడంతో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. అమరావతిలో 36.5 డిగ్రీలు, కావలిలో 36.3 డిగ్రీలు, నెల్లూరులో 36.7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా సీమ జిల్లాల్లో భానుడి ప్రతాపంతో ఉక్కపోత, తేమ పెరిగింది. అత్యధికంగా కర్నూలులో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అనంతపురంలో 39.4, నంద్యాలలో 38.8 డిగ్రీలు, తిరుపతిలో 38.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు మధ్యాహ్నం వేళ ఎండలో బయట తిరగకూడదదని, అవసరమైతే గొడుకు తీసుకుని బయటకు వెళ్లాలని, రోజుకు 5 లీటర్ల నీరు తాగాలని వాతావరణ శాఖ, వైద్య నిపుణులు సూచించారు. 

తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. (Temperature in Andhra Pradesh)
తెలంగాణలో వచ్చే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాలైన మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో ఆకాశం మేఘావృతామై ఉంటుంది. కానీ వర్ష సూచన తక్కువగా ఉంది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా నల్గొండ​, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్ అర్బన్, రూరల్, బద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎండలు 42-43 డిగ్రీలను తాకుతున్నాయి.

బంగారం, వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. వెండి ధర కూడా నేడు కిలోకు రూ.700 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,795 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,310 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.72,700 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,795 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.72,700 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,795 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,310గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,700 గా ఉంది.

20:09 PM (IST)  •  29 Mar 2022

ఏప్రిల్ 11న ఏపీ మంత్రి వర్గ విస్తరణ  

ఏపీలో మంత్రి వర్గ విస్తరణపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 8వ తేదీన గవర్నర్ బిశ్వభూషణ్ తో సీఎం జగన్ భేటీ అవ్వనున్నారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై గవర్నర్ కు వివరించనున్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఏపీ కొత్త కేబినేట్ కొలువుదీరనుంది. ఒక రోజు ముందుగానే కొత్త మంత్రులకు సమాచారం అందస్తారని సమాచారం.  

20:09 PM (IST)  •  29 Mar 2022

ఏప్రిల్ 11న ఏపీ మంత్రి వర్గ విస్తరణ  

ఏపీలో మంత్రి వర్గ విస్తరణపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 8వ తేదీన గవర్నర్ బిశ్వభూషణ్ తో సీఎం జగన్ భేటీ అవ్వనున్నారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై గవర్నర్ కు వివరించనున్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఏపీ కొత్త కేబినేట్ కొలువుదీరనుంది. ఒక రోజు ముందుగానే కొత్త మంత్రులకు సమాచారం అందస్తారని సమాచారం.  

19:45 PM (IST)  •  29 Mar 2022

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ 

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన మెడికల్ విద్యార్థులను ఆదుకోవాలని లేఖలో కోరారు. ఇటీవల శాసనసభలో సీఎం కేసీఆర్ ఉక్రెయిన్ విద్యార్థులను ఆదుకుంటామని ప్రకటించారు. అందుకోసం కేంద్రానికి లేఖ రాస్తామని పేర్కొన్నారు. 

16:13 PM (IST)  •  29 Mar 2022

Telangana Common Entrance Test: తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ టెస్టు తేదీలు ఇవే

తెలంగాణలో కామన్ ఎంట్రన్స్‌ టెస్టు తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. లాసెట్‌ మూడేళ్ల కోర్సు సహా ఇతర సెట్‌ల ప్రవేశ పరీక్ష తేదీల వివరాలు ఇలా ఉన్నాయి. ఐసెట్‌ మినహా మిగతావాటిని ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహిస్తోంది. 

16:11 PM (IST)  •  29 Mar 2022

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సీఎం జగన్ 

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 2014లో అనుమతి లేకుండా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారని జగన్ పై అప్పట్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదు అయింది. ఈ కేసు విచారణకు హాజరు కావాలని ప్రజాప్రతినిధుల కోర్టు ఇటీవల ఆదేశాలు జరిచేసింది. దీంతో సీఎం జగన్ ఆ కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  

 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Unstoppable With NBK Suriya Episode : అన్​స్టాపబుల్ షోలో కంగువ టీమ్.. కార్తీతో కలిసి సూర్యని టీజ్ చేసిన బాలయ్య, ప్రోమో నెక్స్ట్ లెవెల్ ఉందిగా
అన్​స్టాపబుల్ షోలో కంగువ టీమ్.. కార్తీతో కలిసి సూర్యని టీజ్ చేసిన బాలయ్య, ప్రోమో నెక్స్ట్ లెవెల్ ఉందిగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Unstoppable With NBK Suriya Episode : అన్​స్టాపబుల్ షోలో కంగువ టీమ్.. కార్తీతో కలిసి సూర్యని టీజ్ చేసిన బాలయ్య, ప్రోమో నెక్స్ట్ లెవెల్ ఉందిగా
అన్​స్టాపబుల్ షోలో కంగువ టీమ్.. కార్తీతో కలిసి సూర్యని టీజ్ చేసిన బాలయ్య, ప్రోమో నెక్స్ట్ లెవెల్ ఉందిగా
Devara OTT Release Date: అఫీషియల్: ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
అఫీషియల్: ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
Picnic Safety Tips: పిక్‌నిక్‌కు ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి 
పిక్‌నిక్‌కు ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Embed widget