Raitubandhu Funds Release : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - రైతు బంధు నగదు జమ తేదీ ఇదే !
28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నగదు జమ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఉత్తర్వులను చీఫ్ సెక్రటరీ విడుదల చేశారు.
Raitubandhu Funds Release : ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈనెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనున్నది. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ కింద.. రైతులకు ఎకరాకు రూ.5వేల చొప్పున ఏడాదిలో రెండు పంటలకు రూ.10వేల పెట్టుబడి సాయం అందజేస్తున్నది.
ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనున్నది.
— Telangana CMO (@TelanganaCMO) June 22, 2022
జూన్ 1న ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 20 రోజులు దాటినా.. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జయచేయలేదు. సాధారణంగా జూన్ ప్రారంభంలో ఖరీఫ్ లబ్ధిదారుల జాబితాను ఖరారు చేస్తున్న ప్రభుత్వం.. రెండో వారంలో నిధులు విడుదల చేస్తోంది. అయితే ీ సారి ఆ ప్రక్రియలో ఆలస్యం చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అప్పులు తీసుకోకుండా నియంత్రించడం వల్ల సమస్యలు ఏర్పడ్డాయి. ఇప్పుడు సమస్యను అధిగమించి నిధులను సమీకరించి.. 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని నిర్ణయించారు. యాసంగిలో లబ్దిదారుల సంఖ్య అరవై ఆరున్నర లక్షలకు చేరుకోగా 7వేల 600 కోట్లను ఖర్చు చేయనున్నారు.
మొదటిసారి రైతు బంధు అర్హుల జాబితాలో చేరినవారు స్థానిక ఏఈఓలు, ఏఓలను కలిసి పట్టాదార్ పాసు పుస్తకాలు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన జిరాక్సులు సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది. బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారిన ఖాతాదారులు ఆందోళన చెందవద్దన్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులు నివృత్తి చేస్తారని స్పష్టం చేశారు.
అయితే గతంలో మాదిరిగా రైతులు అందరికీ ఒకేసారి బంధు డబ్బులు వేయకుండా.. అందుబాటులో ఉన్న నిధులకు తగ్గట్టుగా అధికారులు డేటా డివైడ్ చేస్తున్నారు. మొదట ఎకరం, ఆ తర్వాతి రోజు రెండు ఎకరాలు, ఆ తర్వాత మూడు ఎకరాలు.. ఇలా పదెకరాల వరకు విడతల వారీగా నిధులు జమ చేస్తారు. మొదట చిన్న సన్నకారు రైతులకు అందిస్తారు.