అన్వేషించండి

Mallareddy Case : మల్లారెడ్డిపై దాడి ఘటనలో కాంగ్రెస్ నేతలపై కేసులు - రేవంత్ అనుచరుల పనేనా ?

మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడి ఘటనలో రేవంత్ రెడ్డి అనుచరులపై కేసులు నమోదు చేశారు. అయితే ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు చెబుతున్నారు.

 

Mallareddy Case : రెడ్డి సింహగర్జన సభలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై దాడికి జరిగిన ప్రయత్నంపై కేసులు నమదోయ్యాయి. మల్లారెడ్డిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్డి సభలోకి కొంతమంది దుండగులు ప్రవేశించారని.. వారే ఈ దాడికి పాల్పడ్డట్టు ఫిర్యాదులో  పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు  సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, హరివర్ధన్‌రెడ్డి దాడికి ప్రయత్నించారని  ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీరిద్దరూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరులుగా భావిస్తున్నారు.  మొత్తం 16 మందిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

నిందితులపై సెక్షన్ 173, 147, 149, 341, 352, 506 కింద కేసు నమోదు చేశారు.  త్వ‌ర‌లోనే ఆ పదహారు మందిని  గుర్తించి, కేసులు న‌మోదు చేస్తామ‌ని పోలీసులు తెలిపారు. మీడియాలో వచ్చిన దృశ్యాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తిస్తున్నారు.  రెడ్డి సింహ గర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై దాడి జరిగింది. సీఎం కేసీఆర్ ను ఆయన పొగుడుతూండగా సభకు  హాజరైన వారి నుంచి నిరసన వ్యక్తమయింది.  దీంతో మంత్రి తన ప్రసంగాన్ని నిలిపివేశారు. అయినప్పటికీ నిరసనకారులు రెచ్చిపోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన నిరసనకారులు మల్లారెడ్డి కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. చేతికందిన కుర్చీలు, మంచినీళ్ల సీసాలు కాన్వాయ్ పై విసురుతూ దాడి చేశారు. పోలీసులు వలయంగా ఏర్పడి మంత్రిని అక్కడి నుంచి తరలించారు.

ఇక తెలంగాణ కాంగ్రెస్ చింతన - రెండు రోజుల పాటు అక్కడే !

ఉదయం ప్రెస్ మీట్ పెట్టిన మల్లారెడ్డి తనపై దాడి చేసింది రేవంత్ రెడ్డి వర్గీయులేనని ఆరోపించారు. తన హత్యకు కుట్ర జరిగిందని ఆయన మండిపడ్డారు.  తనపై దాడి చేయటానికి రెడ్డి సభ మంచి అవకాశంగా రేవంత్ రెడ్డి భావించి పక్కా ప్లాన్ ప్రకారమే తనపై రెడ్డి సభకు గూండాలను పంపించి దాడి చేయించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నానన్న దుగ్ధతోనే అనుచరుల ద్వారా దాడి చేయించాడని పేర్కొన్నారు.

ప్రస్తుతం తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. కేసులు నమోదు చేశారు కానీ. సోమశేఖర్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. న్యాయసలహా తీసుకుని ముందుకు వెళ్తామనిచెబుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mahabubabad Farmers Attack: మహబూబాబాద్‌లోని యూరియా గోదాంపై రైతుల దాడి- ఎరువుల బస్తాలు ఎత్తుకెళ్లిన అన్నదాతలు
మహబూబాబాద్‌లోని యూరియా గోదాంపై రైతుల దాడి- ఎరువుల బస్తాలు ఎత్తుకెళ్లిన అన్నదాతలు
కవిత కొత్త పార్టీ: కేసీఆర్ బాటలో నడుస్తూ సామాజిక తెలంగాణ సాధిస్తారా? సంచలన రాజీనామా వెనుక అసలు కథేంటి?
నాడు టీడీపీలో ఉండి కేసీఆర్, నేడు బీఆర్ఎస్‌లో కవిత చేసింది ఒక్కటేనా ?
Nagarkurnool Kids Murder: చావాలంటే చనిపోవచ్చు..పిల్లల్ని కూడా చంపాలా? - ఈ తండ్రి చేసిన పని తెలిస్తే గుండె పగిలిపోతుంది!
చావాలంటే చనిపోవచ్చు..పిల్లల్ని కూడా చంపాలా? - ఈ తండ్రి చేసిన పని తెలిస్తే గుండె పగిలిపోతుంది!
Lokesh To Delhi: శుక్రవారం ప్రధాని మోదీతో నారా లోకేష్ భేటీ - మ్యాటర్ సీరియస్సేనా ?
శుక్రవారం ప్రధాని మోదీతో నారా లోకేష్ భేటీ - మ్యాటర్ సీరియస్సేనా ?
Advertisement

వీడియోలు

Adilabad Ganapathi Navaratri Special | ఆదిలాబాద్ గణపతి పందిళ్లలో మహారాష్ట్ర ఆచారం | ABP Desam
Afganistan vs Pakistan | పాకిస్తాన్‌పై ఆఫ్గానిస్తాన్ బంపర్ విక్టరీ | ABP Desam
Kohli on Bengaluru Stampede | 2 నెలల తర్వాత బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పందించిన కోహ్లీ | APB Desam
Robin Utappa vs Virat Kohli | కోహ్లీపై చేసిన కామెంట్స్‌పై ఊతప్ప పశ్చాత్తాపం | ABP Desam
Ashwin on Slapgate Issue | లలిత్ మోదీపై రవిచంద్రన్ అశ్విన్ సీరియస్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mahabubabad Farmers Attack: మహబూబాబాద్‌లోని యూరియా గోదాంపై రైతుల దాడి- ఎరువుల బస్తాలు ఎత్తుకెళ్లిన అన్నదాతలు
మహబూబాబాద్‌లోని యూరియా గోదాంపై రైతుల దాడి- ఎరువుల బస్తాలు ఎత్తుకెళ్లిన అన్నదాతలు
కవిత కొత్త పార్టీ: కేసీఆర్ బాటలో నడుస్తూ సామాజిక తెలంగాణ సాధిస్తారా? సంచలన రాజీనామా వెనుక అసలు కథేంటి?
నాడు టీడీపీలో ఉండి కేసీఆర్, నేడు బీఆర్ఎస్‌లో కవిత చేసింది ఒక్కటేనా ?
Nagarkurnool Kids Murder: చావాలంటే చనిపోవచ్చు..పిల్లల్ని కూడా చంపాలా? - ఈ తండ్రి చేసిన పని తెలిస్తే గుండె పగిలిపోతుంది!
చావాలంటే చనిపోవచ్చు..పిల్లల్ని కూడా చంపాలా? - ఈ తండ్రి చేసిన పని తెలిస్తే గుండె పగిలిపోతుంది!
Lokesh To Delhi: శుక్రవారం ప్రధాని మోదీతో నారా లోకేష్ భేటీ - మ్యాటర్ సీరియస్సేనా ?
శుక్రవారం ప్రధాని మోదీతో నారా లోకేష్ భేటీ - మ్యాటర్ సీరియస్సేనా ?
Man shoots wife: బిజీ మార్కెట్‌లో భార్యను కాల్చి చంపేశాడు - కానీ పారిపోలేదు అక్కడే ఉన్నాడు - ఏం చేశాడంటే ?
బిజీ మార్కెట్‌లో భార్యను కాల్చి చంపేశాడు - కానీ పారిపోలేదు అక్కడే ఉన్నాడు - ఏం చేశాడంటే ?
Pithapuram Pawan Kalyan: పిఠాపురం వాసులకు కానుకలే కానుకలు - ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న పవన్- ఈ సారి టీచర్లకు !
పిఠాపురం వాసులకు కానుకలే కానుకలు - ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న పవన్- ఈ సారి టీచర్లకు !
GST Reform: GST తగ్గింపు వల్ల కొత్త బైకులు కొనేవాళ్లకూ లాభమే - విడిభాగాల రేట్లు కూడా తగ్గుతాయి
దసరాకు ముందు GST ధమాకా - బైకులు, స్పేర్‌ పార్ట్స్‌ కొనేవాళ్లకూ లాభమే
GST 2.0: సిగరెట్, మందు తాగడం మరింత భారం, ఈ వస్తువులు ఏ స్లాబ్ పరిధిలోకి వస్తాయి?
సిగరెట్, మందు తాగడం మరింత భారం, ఈ వస్తువులు ఏ స్లాబ్ పరిధిలోకి వస్తాయి?
Embed widget