BRS BC Politics: బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ పోరు బాట - రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టాలని నిర్ణయం
BC reservations: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ అన్యాయం చేసిందని బీఆర్ఎస్ రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టనుంది. అలాగే రాష్ట్రంలోనూ నిరసనలు చేపట్టనున్నారు.

BRS to introduce BC reservations private bill in Rajya Sabha: బీసీలకు అధికారికంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. హైకోర్టు జీవో 29 రద్దు చేయడంతో ఆ స్థానంలో జీవో 46ను ప్రభుత్వం తీసుకు వచ్చింది. అంటే పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగన్నాయి. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని.. పోరుబాట పట్టాలని బీఆర్ెస్ నిర్ణయించింది.
గ్రామ స్థాయిలో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని పోరు బాట
కాంగ్రెస్ పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టేందుకు గ్రామస్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. బీసీ
నాయకులు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో సోమవారం సమావేశమయ్యారు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ నుంచి ఇప్పటిదాకా బీసీలకిచ్చిన హామీలు,వాటిని నెరవేర్చకుండా చేసిన కుట్రలు, కొనసాగుతున్న కుతంత్రాలు,42% రిజర్వేషన్స్ అమలుపర్చకుండా చేస్తున్న మోసం,దగా గురించి శాసనమండలి సభ్యులు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ చేసిన మోసాన్నిప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.
రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు జరపాలన్న బీసీ సంఘాలు
మరో వైపు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ కుల సంఘాలు సమావేశమయ్యాయి. ముఖ్య అతిధులుగా హాజరైన కుల సంఘాల నాయకులు, మాజీ బీసీ చైర్మెన్ వకుళభరణం కృష్ణ మోహన్, డైరెక్టర్ శంకర్ హాజరయ్యారు. 46 జిఓ తో పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం ఎంత వరకు కరెక్ట్ అని దర్శకులు శంకర్ ప్రశ్నించారు. కుట్రలు అతి వేగంగా ప్రయాణం చేస్తున్నాయి.. మన బలహీనత వారికి బలం అయిందన్నారు. బీసీ ల హక్కుల పై మన్ను కప్పడానికి చూస్తున్నారు.. ఇచ్చిన మాటకు కట్టుబడే నైతికత లేదన్నారు. బీసీ లు అంటే బలహీనులు కాదు.. బీసీలంటే బలం..రేపు ప్రతి కుటుంబం నుండి ఒక నామినేషన్ వేయాలని పిలుపునిచ్చారు. 3 లక్షల కోట్లు తెలంగాణ బడ్జెట్.. 3000 కోట్ల బడ్జెట్ కోసం ఎన్నికలు పెడతారా..అని ప్రశ్నించారు.
బీసీలను వంచించి మోసం చేసిండు రేవంత్ రెడ్డి. pic.twitter.com/fw2BcNIM3M
— Jogu Ramanna (@JoguRamannaBRS) November 24, 2025
పార్లమెంట్ లో ప్రైవేటు బిల్లు పెట్టాలని నిర్ణయం
మరో వైపు బీఆర్ఎస్ పార్టీ ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలని నిర్ణయించుకుంది. రాజ్యసభలో బీసీ రిజర్వేషన్లకు ప్రైవేటు బిల్లు పెట్టాలని నిర్ణయించుకుంది. వద్దిరాజు రవిచంద్ర ఈ బిల్లును ప్రతిపాదించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేసిందని.. ఇప్పుడు తాము పార్లమెంట్ పెట్టే బిల్లుకు మద్దతిస్తారా లేదా అన్నదానిపై వారు ప్రశ్నించనున్నారు. అన్ని వైపుల నుంచి బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పై ఎటాక్ చేయాలని నిర్ణయించుకున్నారు.





















