అన్వేషించండి

CM Revanth Reddy: రెండు, మూడు రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ - కొడంగల్‌లో సంచలన ప్రకటన చేసిన సీఎం రేవంత్

Sarpanch election notification: రెండు, మూడు రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని కొడంగల్‌లో సీఎం రేవంత్ ప్రకటించారు. అభివృద్ధికి అడ్డుపడేవారిని ఎన్నుకోవద్దని పిలుపునిచ్చారు.

Panchayat election notification in two to three days:  పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రెండు రోజుల్లో వస్తుందని సీఎం రేవంత్ కొడంగల్ లో ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకమైనవని.. అభివృద్ధికి అడ్డుపడేవారిని ఎన్నుకోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.  కోడంగల్‌లోని యెంకేపల్లి రోడ్డులో అక్షయపాత్ర ఫౌండేషన్ మిడ్ డే మీల్స్ కిచెన్ బిల్డింగ్ కోసం రేవంత్ భూమిపూజ చేశారు.  అలాగే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తర్వాత బహిరంగసభలో పాల్గొన్నారు. 

అభివృద్ధిలో కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఒక మోడల్ గా మారుస్తామని.. సర్పంచ్ ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలు సంతోషంగా ఉంటేనే  ఆ రాష్ట్రంలో ఆర్ధిక అభివృద్ధి ఉంటుంని.. ప్రతీ పేద తల్లి కళ్లల్లో ఆనందం చూడాలని సన్నబియ్యం పంపిణీ చేపట్టామన్నారు. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం.. వారిని ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని తెలిపారు. అదానీ అంబానీలతో పోతే పడేలా సోలార్ ప్లాంట్స్ నిర్వహణ మహిళలకు అప్పగించామని.. గుర్తు చేశారు.  మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు మంచి చదువు అందించడం ఒక్కటే మార్గం .మీ పిల్లలు గొప్పగా చదువుకుంటేనే మీ జీవితాల్లో మార్పు సాధ్యమవుతుందన్నారు.                      

అందుకే అక్షయ పాత్ర ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నాం . ఏ విద్యార్థి కూడా ఆకలితో ఇబ్బంది పడకుండా చేస్తున్నామని తెలిపారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా మధ్యాహ్న భోజనాన్ని అందించే కార్యక్రమం తీసుకున్నాం . బిడ్డల గురించి కన్నతల్లి ఆలోచించినట్లుగా… మా ప్రభుత్వం ఆలోచించి వారి ఆకలి తీరుస్తోందని భరోసా ఇచ్చారు.                               

ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మా మొదటి ప్రాధాన్యత  కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్, వెటర్నరీ, అగ్రి, పారామెడికల్, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలలు , ఏటీసీలను, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాలలు, సైనిక్ స్కూల్ తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి గొప్ప చదువులకోసం కొడంగల్ కు వెళ్లాలి అనేలా కొడంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. 16 నెలల్లో అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్ గా కొడంగల్ ను మార్చాలని ప్రయత్నిస్తున్నామని.. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు.                
 
ఆడబిడ్డలకు ప్రభుత్వం అందిస్తున్న సారె ఇందిరమ్మ చీరలు ..అధికారులు ప్రతీ ఆడబిడ్డకు చీర చేరేలా చూడాలన్నారు. పదేళ్లు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంటుంది ..రాజకీయాలకు అతీతంగా కొడంగల్ ను అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.                 

టాప్ హెడ్ లైన్స్

TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Viral Video: వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన
వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Embed widget