అన్వేషించండి

KTR: ఆ ఇద్దరిలో ఎవరు సన్నాసో చెప్పాలి, వీపులు పగలగొట్టడమే ప్రజాపాలనా?: కేటీఆర్

KTR on Revanth Reddy: బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏంటో ప్రజలు ఆర్నెల్లలోనే అర్థం చేసుకున్నారని అన్నారు.

Telangana News: విద్యార్ధులను అధికారం కోసం వాడుకున్న రాహుల్ గాందీ సన్నాసా.. లేక రేవంత్ రెడ్డి సన్నాసా చెప్పాలి. విద్యార్థులను, నిరుద్యోగులను అవమానపరిచేలా మాట్లాడిన రేవంత్ వారికి క్షమాపణ చెప్పాలి’’ అని కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన నిప్పులు చెరిగారు. మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 6 వేల అదనపు పోస్టులతో విద్యార్ధులను, నిరుద్యోగులను ధగా చేస్తున్నారని విమర్శించారు. నేడు విద్యార్థులపై దాడులు చేస్తున్న పోలీసుల పేర్లు డైయిరీలో నమోదు చేస్తున్నారని.. అధికారంలోకి వచ్చినాక వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

ప్రజలపై దాడులు చేయడమే ప్రజాపాలనా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా భరించలేని నిరంకుశ మనస్తత్వం రేవంత్ రెడ్డికి ఉంది. తమ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపైన పోలీసు దాడులు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. రాహుల్ గాంధీతో సహా నిరుద్యోగులను ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకుంది. జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి దినపత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా ఇచ్చారు. 

ఎవరు సన్నాసో చెప్పాలి
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన కాంగ్రెస్ హామీని నిరుద్యోగులు, విద్యార్థులు అడుగుతున్నారు. నిరుద్యోగులందరికీ యువకులకు రాజకీయాలను రేవంత్ అంటగడుతున్నాడు. ఆరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో సహా అనేక మందిని విద్యార్థులు కలిశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మాతోపాటు, ఇతర పార్టీ నాయకులను కలుస్తున్నారు. ఉద్యోగాలను.. నోటిఫికేషన్లను అడిగితే వారిని అవమానపరిచేలా అడ్డగోలుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి విద్యార్థుల చుట్టూ చేరి వారిని ఎన్నికల కోసం వాడుకున్న రేవంత్ రెడ్డి సన్నాసా.. లేక అప్పుడు వారిని కలిసిన రాహుల్ గాందీ సన్నాసా.. రేవంత్ చెప్పాలి.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి.. తలలు పగలగొట్టడం.. వీపులు పగలగొట్టడమే ప్రజల పాలనా? పాత అరాచకాల కాంగ్రెస్ మోసపూరితంగా కొత్త రూపంలో వచ్చిందని ప్రజలు ఆరు నెలల్లోనే అర్థం చేసుకుంటున్నారు. ఇచ్చిన హామీలు పక్కకు వదిలేసి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను కూడా రద్దు చేస్తున్నారు. ఇదేం అన్యాయమని అడిగిన వాళ్లందరిపైన కేసులు నమోదు చేస్తున్నారు. అధికారంలో లేనప్పుడు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వద్దన్న కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే 7 కొత్త వాటికి అనుమతులు ఇచ్చింది.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 50 వేల ఉద్యోగాలతోని మెగా డీఎస్సీ  విడుదల చేయాలని రేవంత్ రెడ్డి మాట్లాడిండు, కానీ ఈనాడు మెగా డీఎస్సీ మాట మర్చిపోయిండు. కానీ ఇప్పుడు కేవలం సూమారు 6 వేల ఉద్యోగాలు అదనంగా ఇచ్చి డీఎస్సీ పేరుతో యువకులను మోసం చేస్తుండు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ యువకుడు తెలంగాణ కథానాయకుడిగా నిలబడిపోతారు. ఈరోజు విద్యార్థులపై దాడులతో చేస్తున్న గాయాలు మానిపోయినా, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని మాత్రం మర్చిపోరు. తెలంగాణ పోలీసులు అధికారులు విద్యార్థుల పైన చేస్తున్న దాడులను విద్యార్థి నాయకులు తమ డైరీలో నమోదు చేసుకుంటున్నారు. విద్యార్థులపైన ప్రజల పైన దాడులు చేస్తున్న పోలీస్ అధికారులను,  మేము తిరిగే అధికారంలోకి వచ్చినంక వదిలిపెట్టం. 

పదేళ్ల మన ప్రభుత్వ హయాంలో లక్ష అరవై రెండు వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాము.. మరో 40,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతూ ఉండే, అందులోంచి 30 వేల ఉద్యోగాల నియామక పత్రాలను రేవంత్ రెడ్డి ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. విద్యార్థుల ఉద్యోగాల కోసం 95% స్థానిక రిజర్వేషన్లు కల్పించాం. పార్టీ విద్యార్థి విభాగం నుంచి అనేకమంది నాయకులను, ప్రజాప్రతినిధులుగా, చైర్మన్లుగా, మేయర్లుగా, జిల్లా స్థాయి అధ్యక్షులుగా అనేకమందిని పార్టీ తయారు చేసుకోగలిగింది. అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విద్యార్థి నాయకుల పాత్ర కీలకమవుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడగలిగే అవకాశం కలుగుతుంది.

ప్రభుత్వ అన్యాయాలను అక్రమాలను ఎండగట్టవచ్చు. రాజకీయ నాయకులుగా ఎదిగేందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ అవకాశం ఉంటుంది. నిజాయితీపరులు, దమ్మున్న నాయకులు వందలు, వేలమంది ఈ పార్టీకి ఆస్తిగా ఉన్నారు. 2009 నుంచి 2014 దాకా తెలంగాణ కోసం విద్యార్థులు చేసిన గొప్ప ఉద్యమ స్ఫూర్తిని పోరాటాలను ఇప్పటి విద్యార్థులకు చెప్పేలా చేయాలి. విద్యారంగంలో జరిగే ప్రతి అన్యాయం దగ్గర విద్యార్ధి విభాగం అందోళన ఉండాలి’’ అని కేటీఆర్ పిలుపు ఇచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget