Top Headlines Today: యువగళం ముగింపు సభకు జనసేనాని పవన్ దూరం! కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్స్
AP Telangana Latest News 16 December 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
AP Telangana News Today: కొందరు ఎన్‌ఆర్‌ఐలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదు- కేటీఆర్‌పై రేవంత్ సెటైర్‌లు
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు మొదటి విడతలోనే వాడీ వేడి చర్చ సాగుతోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చలో భాగంగా కేటీఆర్, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య తీవ్ర చర్చ జరిగింది. ఓటింగ్ పర్సంటేజ్ చెబుతున్న కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కొందరు ఎన్‌ఆర్‌ఐలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే కేసీఆర్ ఎదిగారని గుర్తు చేశారు. గత 9 ఏళ్ల పాలన గుర్తుచేస్తున్న వారికి అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం గురించి చెప్పాలని కేటీఆర్ సభలో చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం జరిగిన అరాచకాలను కూడా గుర్తు చేసుకోవాలన్నారు. ప్రగతి భవన్‌కు వెళ్లి అక్కడ కేసీఆర్ పేరుపై మట్టి పూసినట్టుగా చరిత్రను చెరిపేయలేమన్నారు కేటీఆర్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మేము ఎప్పటికీ ప్రజాపక్షమే అన్న కేటీఆర్, అసెంబ్లీలో వాడీవేడీ చర్చ
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అభూత కల్పన, అసత్యాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) అన్నారు. నాలుగో రోజు అసెంబ్లీలో గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించగా, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ బలపరిచారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీ వేడీ చర్చ సాగింది. గవర్నర్ దారుణమైన ప్రసంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థం అవుతోందని కేటీఆర్ మండిపడ్డారు. తాము ఎక్కడ ఉన్నా ప్రజా పక్షమే అని, కాంగ్రెస్ పాలనలో తాగు, సాగు నీరు, కరెంట్ కు దిక్కు లేదని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'యువగళం' ముగింపు సభకు జనసేనాని పవన్ దూరం - టీడీపీ నేతలకు సమాచారం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' ముగింపు కార్యక్రమానికి తాను హాజరు కాలేనని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన లోకేశ్ 'యువగళం' పాదయాత్ర ఈ నెల 20తో ముగియనుంది. ఆ రోజు విశాఖలోని భోగాపురం ఎయిర్ పోర్ట్ సమీపంలో యువగళం ముగింపు సభ జరగనుంది. ఈ సభకు రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు టీడీపీ ప్రత్యేక ఆహ్వానం పంపింది. అయితే, ఆ రోజు తనకు ముందుగా నిర్ణయించుకున్న వేరే కార్యక్రమాలు ఉన్నాయని, అందుకే కార్యక్రమానికి హాజరు కాలేనని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కాంగ్రెస్ తో ఎంఐఎం జత కట్టిందా? ఘాటుగా స్పందించిన అక్బరుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే (MIM MLA) అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi)కి ఛాన్స్ ఇచ్చారు. ఎంఐఎంకి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిందని.. ఇవన్నీ గమనిస్తే తెలంగాణలో, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అలయెన్స్ గా మారాయని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎవరితోనూ పొత్తులో లేదని, ఒంటరిగానే పోరాటం చేస్తుందని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం అలయన్స్ అన్న వార్తలు వచ్చాయని, కానీ అందులో నిజం లేదన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఎమ్మెల్యేగా ఏమీ చేయలేకపోయా - రాప్తాడు ఎమ్మెల్యే కామెంట్స్ !
వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టిక్కెట్ పై అనుమానం పెరిగిపోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు నిరాశకు గురవుతున్నారు. తాజాగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనం అవుతున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తనకు చాలా అసంతృప్తి ఉందని.. నాలుగున్నర ఏళ్ళుగా ఎన్నో చేద్దాం అనుకున్నా....కాని అనుకున్న స్థాయిలో చేయలేకపోయానన్నారు. రాబోయే ఎన్నికల్లో ( Elections ) రాప్తాడు నుంచే పోటీ చేసి... గెలుస్తానని తర్వతా అభివృద్ధి చేస్తానన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి