అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Andhra News: 'యువగళం' ముగింపు సభకు జనసేనాని పవన్ దూరం - మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరవుతానని టీడీపీ నేతలకు సమాచారం

Nara Lokesh: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభ ఈ నెల 20న జరగనుంది. అయితే, ఆ రోజు వేరే కార్యక్రమాల కారణంగా తాను హాజరు కాలేనని జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు.

Pawan Kalyan not Attending the Yuvagalam Closing Ceremony: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' ముగింపు కార్యక్రమానికి తాను హాజరు కాలేనని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన లోకేశ్ 'యువగళం' పాదయాత్ర ఈ నెల 20తో ముగియనుంది. ఆ రోజు విశాఖలోని భోగాపురం ఎయిర్ పోర్ట్ సమీపంలో యువగళం ముగింపు సభ జరగనుంది. ఈ సభకు రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు టీడీపీ ప్రత్యేక ఆహ్వానం పంపింది. అయితే, ఆ రోజు తనకు ముందుగా నిర్ణయించుకున్న వేరే కార్యక్రమాలు ఉన్నాయని, అందుకే కార్యక్రమానికి హాజరు కాలేనని తెలిపారు. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి తప్పకుండా వస్తానని చెప్పారు. కాగా, రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ నిర్వహించే పెద్ద సభలకు పవన్ హాజరవుతారని తెలుస్తోంది. 

భారీ ఏర్పాట్లు.. ప్రత్యేక రైళ్లు

మరోవైపు, లోకేశ్ యువగళం ముగింపు సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరానున్నారు. దాదాపు, 5 లక్షల మంది వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో 7 ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సభకు తొలుత టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరవుతారని అంతా భావించారు. అయితే, వేరే కార్యక్రమాల కారణంగా తాను హాజరు కాలేనని పవన్ చెప్పారు. దీంతో చంద్రబాబు, బాలకృష్ణ ఇతర పార్టీ ప్రముఖులు ముగింపు సభకు హాజరు కానున్నారు.

కొనసాగుతోన్న పాదయాత్ర

అటు, నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 224వ రోజు (శనివారం) ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా లోకేశ్, అరబుపాలెం బీసీ నాయకులు, అనకాపల్లి బెల్లం తయారీదారులు, గంగాదేవిపేటలో రైతులతో సమావేశమయ్యారు. జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ.75,760 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. వైసీపీ హయాంలో బీసీలపై 26 వేల అక్రమ కేసులు బనాయించారని, తాము అధికారంలోకి వచ్చాక బీసీలకు రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ హయాంలో బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని, చంద్రబాబు హయాంలో 34 శాతానికి పెంచారని గుర్తు చేశారు. 'రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల అండతోనే గంజాయి సాగవుతోంది. టీడీపీ - జనసేన అధికారంలోకి రాగానే నల్లబెల్లంపై ఆంక్షలు తొలగిస్తాం. చెరకు రైతులను ఆదుకుంటాం. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని తిరిగి గాడిలో పెడతాం.' అని వివరించారు. అనంతరం మునగపాకలో అంగన్వాడీల శిబిరానికి వెళ్లిన లోకేశ్ వారి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలను ప్రభుత్వం బెదిరిస్తోందని, వారికి ఇచ్చిన హామీలను సీఎం జగన్ గాలికొదిలేశారని మండిపడ్డారు. అంగన్వాడీల న్యాయ పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 

Also Read: Andhra News: దుప్పటికి చలి మంటలంటుకొని వ్యక్తి సజీవ దహనం - వివాహేతర సంబంధంతో ఇద్దరు, ఏపీలో విషాద ఘటనలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Embed widget