అన్వేషించండి

Topudurthi Prakash Reddy : ఎమ్మెల్యేగా ఏమీ చేయలేకపోయా - రాప్తాడు ఎమ్మెల్యే కామెంట్స్ !

Raptadu MLA Topudurthi Prakash Reddy : ఎమ్మెల్యేగా ఏమీ చేయలేకపోయానని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. వైసీపీ టిక్కెట్ హిట్ లిస్ట్ లో ఆయన పేరు కూడా ఉండటంతో ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

Topudurthi Prakash Reddy :   వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టిక్కెట్ పై అనుమానం పెరిగిపోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు  నిరాశకు గురవుతున్నారు. తాజాగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనం అవుతున్నాయి.  ఎమ్మెల్యేగా గెలిచిన తనకు చాలా అసంతృప్తి ఉందని..  నాలుగున్నర ఏళ్ళుగా ఎన్నో చేద్దాం అనుకున్నా....కాని అనుకున్న స్థాయిలో చేయలేకపోయానన్నారు.  రాబోయే ఎన్నికల్లో ( Elections ) రాప్తాడు నుంచే పోటీ చేసి... గెలుస్తానని  తర్వతా అభివృద్ధి చేస్తానన్నారు. రాప్తాడు నియోజకవర్గాల్లో పలు గ్రామాల్లో రోడ్ల కాంట్రాక్టులను పరిటాల సునీత బంధువులే తీసుకున్నారని కానీ వారు పనులు చేయడం లేదని ఆరోపించారు.                         

రాప్తాడు నియోజకవర్గ పరిధిలో 33 గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కరపత్రాలు పంపిణీ చేయబోతున్నామని ప్రకటించారు.  రోడ్డు నిర్మాణ పనులు కాంట్రాక్ట్ దక్కించుకున్న పరిటాల సునీత ( Paritala Suntha )  కుటుంబీకులు పనులు చేయడం లేదన్నారు.  వచ్చే సోమవారం కల్లా పనులు ప్రారంభించకపోతే....పరిటాల సునీత, కాంట్రాక్టర్ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.  రాబోయే వంద రోజుల్లో వంద కిలో మీటర్లు నియోజకవర్గం పరిధిలో రోడ్డు నిర్మాణ పనులు యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని ప్రణాళికలు రూపొందించామన్నారు. రాప్తాడులో రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంది. దాంతో ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రోడ్ల నిర్మాణాన్ని చేస్తామని ఎమ్మెల్యే చెబుతున్నారు.                                                                           

 రాప్తాడులో సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రజల్లో అసంతృప్తి ఉందని ఆయనకూ టిక్కెట్ నిరాకరించవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై విస్తృత ప్రచారం జరుగుతూండటంతో.. ప్రకాష్ రెడ్డి కంగారు పడుతున్నారు. అందుకే ఆయన తనకూ అసంతృప్తి ఉందని.. ఏమీ చేయలేకపోయానని ఆయన అంటున్నారు. రాప్తాడులో వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా పరిటాల కుటుంబం ఉంది. వారికి టిక్కెట్ల విషయంలో ఢోకా లేదు. వారు పోటీ చేయడం ఖాయం.. తన టిక్కెట్ డొలాయమానంలో పడటంతో ..  ప్రకాష్ రెడ్డి అసంతృప్తికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది.                       

ప్రెస్మీట్‌లో పరిటాల కుటుంబంపైనా విరుచుకుపడ్డారు.   పరిటాల కుటుంబం రాప్తాడులో పాసింగ్ క్లౌడ్స్...వచ్చి వెళ్ళే మేఘాలు లాంటి వాళ్ళన్నారు.  ధర్మవరం టిక్కెట్ కోసం పరిటాల శ్రీరామ్ ఇరవై కోట్లు చంద్రబాబు దగ్గర డిపాజిట్ చేశార్నారు.  రాప్తాడు నియోజకవర్గానికి పరిటాల కుటుంబం అవసరం లేదని ఆరోపించారు.                                

టాప్ హెడ్ లైన్స్

Rayapati Sambasiva Rao: మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుకు అస్వస్థత
మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుకు అస్వస్థత
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
AP Panchayat Polls: జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
Krishna Water War: కృష్ణా జలాల వేడి - కుప్పం దాకా నీళ్లు.. మహబూబ్‌నగర్‌కు మొండిచెయ్యి - రికార్డులు చెబుతున్న నిజాలేంటి?
కృష్ణా జలాల వేడి - కుప్పం దాకా నీళ్లు.. మహబూబ్‌నగర్‌కు మొండిచెయ్యి - రికార్డులు చెబుతున్న నిజాలేంటి?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Hyderabad Crime News: కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
Aakasamlo Oka Tara Review : తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
Ujjwal Nikam On Ajmal Kasab: కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
Embed widget