Breaking News Live Telugu Updates: తీన్మార్ మల్లన్న Qnews ఆఫీస్ పై మంత్రి అనుచరుల దాడి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE

Background
IND vs AUS, 2nd ODI: రెండో వన్డేలో 117కే భారత్ ఆలౌట్
IND vs AUS: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 26 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ (31: 35 బంతుల్లో, నాలుగు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిషెల్ స్టార్క్ ఐదు వికెట్లు దక్కించుకున్నాడు.
తీన్మార్ మల్లన్న Qnews ఆఫీస్ పై మంత్రి అనుచరుల దాడి
తీన్మార్ మల్లన్న Qnews ఆఫీస్ పై మంత్రి అనుచరులు దాడి
▪️హైదరాబాద్ లోQnews ఆఫీస్ లో విధ్వంసం.
▪️మంత్రి అనుచరులు విచ్చలవిడిగా దాడి.
▪️పూర్తిగా ధ్వంసం అయిన QNEWS ఆఫీస్.
▪️జర్నలిస్టులపై కత్తులతో దాడి చేసినట్లు ఆరోపణలు.
▪️ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.
CM Jagan News: జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్
జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా తిరువూరు వాహినీ కాలేజ్ గ్రౌండ్స్‌లో సీఎం జగన్ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
- ఒక కుటుంబం తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది.
- ఒక మనిషి జీవన ప్రమాణం, జీవన ప్రయాణం నిర్దేశించేది చదువే
- చదువుకు పేదరికం అడ్డుకాకూడదు
- దేశంలో విద్యాదీవన, వసతి దీవెన పథకాలు ఎక్కడా లేవు
- కాలేజీ ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత మీ జగనన్నదే
- గత ప్రభుత్వంలో కాలేజీ ఫీజులు బకాయిలు పెట్టేవారు
- ఫీజులు కట్టలేక చదువులు మానివేసే పరిస్థితి రాకూడదు
- అందుకే విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నాం
- జగనన్న విద్యాదీవెన ద్వారా ఇప్పటివరకు రూ.9,947 కోట్లు ఇచ్చాం
Kishan Reddy: స్వప్న లోక్ కాంప్లెక్స్ వద్ద కిషన్ రెడ్డి పర్యటన
స్వప్న లోక్ కాంప్లెక్స్ వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాద ఘటనలో ఆరు మంది మృతి చెందడం పట్ల కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్ని ప్రమాదాల నివారణకు కఠినంగా వ్యవహరించాలని కిషన్ రెడ్డి కోరారు. కమిటీలు ఏర్పాటు చేయడం మినహా ప్రమాదాల నివారణకు కృషి చేయడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఉంటాయని మృతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. కేంద్రం నుండి రెండు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అక్రమ కట్టడాలకు జిహెచ్ఎంసి ప్రోత్సహిస్తూ రెగ్యులరేషన్ పేరుతో ఖజానా నింపుకోవడమే తప్ప ప్రమాదల నివారణకి ఏమాత్రం పాటుపడడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.
Elephant Death: ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో విద్యుత్ షాక్ తో ఏనుగు మృతి
చిత్తూరు జిల్లాలోని ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన ధర్మపురిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పంట పొలాల్లో వెళ్తున్న ఏనుగుకు విద్యుత్ వైర్లు తగిలడంతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన ఏనుగును పరిశీలించారు. వేటగాళ్ళు అటవీ జంతువుల కోసం విద్యుత్ తీగలను ఏర్పాటు చేశారా లేక పొరపాటున విద్యుత్ తీగలు తెగి ఏనుగుకు తగలడంతో మృతి చెందిందా అనే కోణంలో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.. ఈ నెల 7వ తారీఖున తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో పొలం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి మూడు ఏనుగులు మృతి చెందాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

