అన్వేషించండి

Breaking News Live Telugu Updates: రేపు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే   

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: రేపు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే   

Background

ఏపీ, తెలంగాణలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు మరో రెండు రోజులు కొనసాగనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నట్లుగా భారత వాతావరణ విభాగం అధికారులు అంచనా వేశారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితి
మంగళవారం (జూలై 12) బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. దీనిపై సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించిన ఉపరితల ఆవర్తనం నైరుతి వైపునకు ఒంగి ఉంది. 

దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు పడతాయని పేర్కొన్నారు. నిన్న కాకినాడ, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడ్డాయి. 

రుతుపవన కరెంట్‌ బలంగా ఉండడంతో సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయని, ఈనెల 16 వరకు కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఇక శుక్రవారం (జూలై 15) నుంచి రెండు మూడు రోజులపాటు ఏపీలో వర్షాలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. దీంతో వారం నుంచి ఆగకుండా ముసురుపట్టి కురుస్తున్న వర్షాలు కాస్త విరామం ఇవ్వనున్నాయి. అయితే, రేపు (జూన్ 14) సాయంత్రం నుంచి వర్షాలు చాలా వరకూ తగ్గుతాయని, తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

Telangana Weather: తెలంగాణలో ఇలా
దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో (జూలై 14, 15 తేదీలు) తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, జనగాం జిల్లాలకు హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. బుధవారం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరు మండలంలో రాష్ట్రంలో కెల్లా రికార్డు స్థాయిలో 39.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సగటున 6.48 సెంటీమీటర్ల వర్షం పడిందని అంచనా వేశారు. బుధవారం తరహాలోనే తెలంగాణలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుందని అంచనా వేశారు.

బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) గ్రాముకు రూ.10 తగ్గింది.  వెండి ధర కూడా నేడు రూ.0.80 పైసలు తగ్గింది. అంటే కిలోకు రూ.800 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.46,700 గా స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,950 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.61,700 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.61,700 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,700 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,950గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.61,700 గా ఉంది.

17:30 PM (IST)  •  14 Jul 2022

CM Jagan Aerial Survey : రేపు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే 

రేపు మధ్యాహ్నం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి  జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించున్నారు. ఏరియల్ సర్వే కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలన్నారు.  

15:50 PM (IST)  •  14 Jul 2022

భద్రాచలం వద్ద ఉగ్రరూపంలో గోదావరి, 60.80 అడుగులకు చేరిన వరద  

భద్రాచలం వద్ద మళ్లీ గోదావరి నీటి మట్టం పెరిగింది. గోదావరి నీటిమట్టం గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు 60.80 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నదిలో ప్రస్తుతం 18.46 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. 

14:44 PM (IST)  •  14 Jul 2022

Mancherial: వరదలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ ద్వారా కాపాడిన అధికారులు

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సోమన్ పల్లి వద్ద గోదావరి నదిలో చిక్కుకున్న ఇద్దరిని హెలికాప్టర్ ద్వారా రక్షించారు. బుధవారం మేకలను కాసేందుకు వెళ్లిన కాపరులు వెనక్కి వచ్చే సమయానికి వరద ముంచెత్తింది. దీంతో వారు వాటర్ ట్యాంక్ ఎక్కేసారు. వరద ఉదృతి తీవ్రం కావడంతో ఎవరు వారిని కాపాడే సాహసం చేయలేకపోయారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వారిని కాపాడడానికి మంత్రి కేటీఆర్ తో మాట్లాదారు. దీంతో హుటాహుటిన హెలికాప్టర్ ను తెప్పించి ఇద్దరిని తరలించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. హెలికాప్టర్ ద్వారా తమని కాపాడినందుకు ఎమ్మెల్యే బాల్క సుమన్, మంత్రి కేటిఆర్ లకు వారు ధన్యవాదాలు తెలిపారు. స్థానికులు చెన్నూర్‌ నియోజకవర్గ ప్రజలు జిల్లా వాసులు సైతం విషయం తెలుసుకొని హర్షం వ్యక్తం చేశారు.

14:42 PM (IST)  •  14 Jul 2022

Hindupur News: హిందూపూర్‌లో మహిళా సెక్యురిటీ గార్డుల నిరసన

హిందూపురం సత్యసాయి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేటు ఏజెన్సీ ద్వారా విధులు నిర్వహిస్తున్నసెక్యూరిటీ గార్డులు  మహిళా  సెక్యూరిటీ  సూపర్వైజర్ తమను వేధింపులకు గురి చేస్తుందంటూ సీఐటీయు ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి  నిరసన  కార్యక్రమంలో పాల్గొన్నారు
 తాము 21 మంది విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా  ఆమె బెదిరింపు  ధోరణి లో వ్యవహరిస్తుందని  డ్యూటీ కి అటెండ్ అయినప్పటికీ    ఆప్ సెంట్ వేస్తుందని , ఏజెన్సీకి సంబంధించిన పనులు కాకుండా  తన సొంత పనులు  చేయాలని ఇబ్బంది పెడుతుందని బాధితులు వాపోయారు. ఆమెను విధుల నుంచి తొలగించి  మరొకర్ని  డ్యూటీకి వేయాలని  ఆందోళన నిర్వహించారు. మరోవైపు ఆమె ప్రైవేటు ఏజెన్సీ ద్వారా  రెండు చోట్ల  ఉద్యోగాలు చేస్తుందని  ఆరోపించారు

12:43 PM (IST)  •  14 Jul 2022

Nizamabad: నిజామాబాద్‌లో వరదలకు 50 చోట్ల దెబ్బతిన్న రోడ్లు

నిజామాబాద్ జిల్లాలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు 50 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆర్మూర్ వద్ద రహదారి తెగిపోయింది. నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా వరద రోడ్డుపై నుంచి వెళ్తోంది. జిల్లాలో 27 వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains Update: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలతో అలర్ట్, తెలంగాణలో చిరు జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలతో అలర్ట్, తెలంగాణలో చిరు జల్లులు
Revanth Reddy: ఇప్పుడంతా స్విగ్గీ రాజకీయాలు - కాంగ్రెస్ టీ-20ని టెస్ట్ మ్యాచ్‌లా ఆడుతోంది - సొంత పార్టీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఇప్పుడంతా స్విగ్గీ రాజకీయాలు - కాంగ్రెస్ టీ-20ని టెస్ట్ మ్యాచ్‌లా ఆడుతోంది - సొంత పార్టీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Kurnool News: కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Smartphone Price Hike Reasons: 2025 నుంచి పెరగనున్న స్మార్ట్ ఫోన్ల ధరలు - ఈ మూడే కారణాలు!
2025 నుంచి పెరగనున్న స్మార్ట్ ఫోన్ల ధరలు - ఈ మూడే కారణాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయడం ట్రంప్‌కి సాధ్యమేనా?Elon Musk Vs Ambani | Starlink closer to India | ట్రంప్ ఎన్నికతో ఇండియాకు స్పీడ్‌గా స్టార్ లింక్!Shankar Maniratnam Game Changer Thug Life | మణిరత్నం శంకర్‌కి ఇది చాలా టఫ్ ఫేజ్ | ABP DesamBorugadda Anil Met Family members CCTV | బోరుగడ్డ అనిల్ రాచమర్యాదలు..మరో వీడియో వెలుగులోకి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains Update: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలతో అలర్ట్, తెలంగాణలో చిరు జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలతో అలర్ట్, తెలంగాణలో చిరు జల్లులు
Revanth Reddy: ఇప్పుడంతా స్విగ్గీ రాజకీయాలు - కాంగ్రెస్ టీ-20ని టెస్ట్ మ్యాచ్‌లా ఆడుతోంది - సొంత పార్టీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఇప్పుడంతా స్విగ్గీ రాజకీయాలు - కాంగ్రెస్ టీ-20ని టెస్ట్ మ్యాచ్‌లా ఆడుతోంది - సొంత పార్టీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Kurnool News: కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Smartphone Price Hike Reasons: 2025 నుంచి పెరగనున్న స్మార్ట్ ఫోన్ల ధరలు - ఈ మూడే కారణాలు!
2025 నుంచి పెరగనున్న స్మార్ట్ ఫోన్ల ధరలు - ఈ మూడే కారణాలు!
Andhra Pradesh: ఏపీ అసెంబ్లీలో చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ అనురాధ - జనసేన, బీజేపీ నేతలకు ఛాన్స్
ఏపీ అసెంబ్లీలో చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ అనురాధ - జనసేన, బీజేపీ నేతలకు ఛాన్స్
Andhra Group 2 : ఆంధ్రా గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - వారు కోరుకున్నట్లుగానే పరీక్ష వాయిదా -ఎప్పటికంటే
ఆంధ్రా గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - వారు కోరుకున్నట్లుగానే పరీక్ష వాయిదా -ఎప్పటికంటే
PM Modi On Caste Census: ఓబీసీలను విడగొట్టేందుకు కాంగ్రెస్ కొత్త నాటకం, కులగణనపై నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు
ఓబీసీలను విడగొట్టేందుకు కాంగ్రెస్ కొత్త నాటకం, కులగణనపై నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు
Highest Selling Bikes: ఒక్క నెలలోనే ఐదు లక్షలకు పైగా సేల్స్ - దుమ్ములేపుతున్న టూ వీలర్ బ్రాండ్ ఇదే!
ఒక్క నెలలోనే ఐదు లక్షలకు పైగా సేల్స్ - దుమ్ములేపుతున్న టూ వీలర్ బ్రాండ్ ఇదే!
Embed widget