By: ABP Desam | Updated at : 25 Mar 2022 06:19 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మసాచుసెట్స్ రాష్ట్ర గవర్నర్ చార్లీ బేకర్ తో మంత్రి కేటీఆర్
KTR America Tour : హైదరాబాద్ నగరంతో కలిసి పని చేసేందుకు అమెరికాలోని బోస్టన్ నగరం ముందుకొచ్చింది. బోస్టన్ లో జరిగిన గ్లోబల్ ఇన్నోవేషన్ 2022 Health Care At a Glance సదస్సులో మసాచుసెట్స్ రాష్ట్ర గవర్నర్ చార్లీ బేకర్, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మసాచుసెట్స్ రాష్ట్రంలో జరుగుతున్న హెల్త్ రికార్డుల డిజిటలీకరణ ప్రయోజనాలను ఆ రాష్ట్ర గవర్నర్ మంత్రి కేటీఆర్ కు వివరించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ చార్లీ బేకర్ మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. తెలంగాణలోని హైదరాబాద్ కి అమెరికాలోని బోస్టన్ నగరానికి మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని, ముఖ్యంగా హైదరాబాద్ లాగే ఇక్కడా అనేక ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాలకు చెందిన కంపెనీలు ఉన్నాయన్నారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవకాశాలను పరిశీలించడంతో పాటు లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీల మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం చాలా అవసరమని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. హెల్త్ రికార్డుల డిజిటలీకరణ కొనసాగుతుందని, దీని వల్ల ఇక్కడి సిటిజన్లకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నయన్న విషయాన్ని గవర్నర్ ప్రస్తావించారు. కరోనా సంక్షోభ సమయంలో ఈ డిజిటల్ హెల్త్ రికార్డుల వలన వేగంగా చికిత్స అందించేందుకు అవకాశం కలిగిందన్నారు.
భవిష్యత్ పెట్టుబడులకు తొలి అడుగు
ఇరు నగరాల మధ్య అవగాహన కోసం చేపట్టే కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా రెండు జిల్లాలో పౌరుల హెల్త్ రికార్డ్ లను డిజిటలైజేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలోని సైంటిస్ట్ లతో పాటు ఐటీ, టెక్ రంగాల డాటా సైంటిస్టుల ఉమ్మడి కృషి వలన రానున్న రోజుల్లో అద్భుతమైన ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత వలన సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని, ఆయా రంగాలకు ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా బయో, లైఫ్ సైన్సెస్ రంగాల్లో టెక్నాలజీకి పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఉన్న నోవార్టిస్ లాంటి కంపెనీల కార్యకలాపాలను ఉదహరించి, హైదరాబాద్ నగరంలో ఉన్న అవకాశాలను తెలిపారు.
లైఫ్ సైన్సెస్ రంగానికి అనేక ప్రోత్సహాకాలు
అమెరికాలోని బోస్టన్ నగరంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగంలో చేపడుతున్న కార్యక్రమాలకు అమెరికాలోని వివిధ కంపెనీల ప్రతినిధులు నుంచి అద్భుతమైన స్పందన లభించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికాలోని బోస్టన్ నగరంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్ గా పేరు ఉందన్నారు. లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలైన ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అందులో ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు, పాలసీ పరమైన నిర్ణయాలు, ఇన్నోవేషన్ కి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఫండ్ ను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ బయో లైఫ్ సైన్సెస్ ఫార్మా ఉత్పత్తులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
Breaking News Live Updates: నిజామాబాద్ నుంచి కాశీకి యాత్రికుల బస్సు, బిహార్‌లో బోల్తా
Karimnagar: టెన్త్ ఎగ్జామ్స్‌కి ఫుల్లుగా తాగొచ్చిన టీచర్, తూలుతూనే ఇన్విజిలేషన్ - బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో రీడింగ్ చూసి అంతా షాక్!
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఉష్ణోగ్రత 4 డిగ్రీలదాకా ఎక్కువ నమోదయ్యే ఛాన్స్!
Petrol-Diesel Price, 25 May: వాహనదారులకు శుభవార్త! నేడు దిగివచ్చిన పెట్రోల్ ధరలు, ఈ సిటీలో మాత్రం స్థిరం
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్
Mahesh Babu Trivikram Movie Update: మహేష్ బాబు సినిమాకూ త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్‌తో వెళతారా?
In Pics: పోలీసుల చేతుల్లోకి అమలాపురం, అడుగడుగునా ఖాకీల మోహరింపు - ఫోటోలు
Deepika padukune: డ్రెస్సా? దుప్పటి చుట్టుకున్నావా? దీపికా డ్రెస్ పై కామెంట్లు