Hyderabad News: షాకింగ్ - చాక్లెట్ లో బతికున్న పురుగు దర్శనం, ఎక్కడంటే?
Worm in Chocolate: ఇష్టంగా కొనుక్కున్న చాక్లెట్ ను తిందామని కవర్ ఓపెన్ చేసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. అందులో బతికున్న పురుగును చూసి ఆందోళనకు గురయ్యాడు.

Man Found Worn in Chocolate: చాక్లెట్స్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఆ ఇష్టంతోనే ఓ వ్యక్తి చాక్లెట్ కొని తినేందుకు యత్నించగా అందులో పురుగును చూసి షాకయ్యాడు. హైదరాబాద్ (Hyderabad) అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో ఓ వ్యక్తి ప్రముఖ సంస్థకు చెందిన చాక్లెట్ కొని తినేందుకు సిద్ధం కాగా అందులో బతికున్న పురుగు కనిపించింది. అది చాక్లెట్ పైనే అటూ ఇటూ పాకుతూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. దీనిపై వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ప్రొడక్ట్స్ క్వాలిటీ, ఎక్స్పైరీ విషయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించాడు. ఈ విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై చాక్లెట్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొరపాటును చూడకుండా ఇలాంటి చాక్లెట్లు తింటే ఏంటి పరిస్థితి అని.. ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
క్యాడ్బరీ చాక్లెట్లో బతికున్న పురుగు
— Telugu Scribe (@TeluguScribe) February 11, 2024
అమీర్పేట్ మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి క్యాడ్బరీ చాక్లెట్ కొన్నాడు.. తెరిచి చూస్తే అందులో బతికున్న పురుగు కనిపించింది. దీనిపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. pic.twitter.com/3NoS8Qpzgy
Also Read: TSRTC News: TSRTC గుడ్ న్యూస్ - బస్ టికెట్ తో పాటే శ్రీశైలం దర్శన టికెట్ బుకింగ్ సదుపాయం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

