Monkeys Family Planning : ఆ ఆస్పత్రి ఓన్లీ ఫర్ మంకీస్.. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు స్పెషాలిటీ..! ఎక్కడో తెలుసా ?
దక్షిణాదిలో కోతులకు ప్రత్యేకంగా ఓ ఫ్యామిలీ ప్లానింగ్, చికిత్స అందించే ఆస్పత్రి ఆదిలాబాద్ నిర్మల్‌లో ఉంది.
![Monkeys Family Planning : ఆ ఆస్పత్రి ఓన్లీ ఫర్ మంకీస్.. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు స్పెషాలిటీ..! ఎక్కడో తెలుసా ? A family planning and care center for monkeys has been opened in Nirmal for the first time in the South. Monkeys Family Planning : ఆ ఆస్పత్రి ఓన్లీ ఫర్ మంకీస్.. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు స్పెషాలిటీ..! ఎక్కడో తెలుసా ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/03/502d0abf54cc3e5e8dc40895e29a1481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇబ్బడి మబ్బడిగా జనాభా పెరిగితే ఏం జరుగుతుంది ? ఆ జనభాకు అవసరమైన తిండి, నీడ, గుడ్డ దొరకదు ! ప్రతీ దానికి కొరత ఏర్పడుతుంది. అందుకే ప్రపంచంలో అన్ని దేశాలు జనాభా నియంత్రణ చేసుకున్నాయి. ప్రజలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడాన్ని ఉద్యమంగా చేశాయి. మరి ఇదే సమస్య జంతువులకు వస్తే. జంతువులకు తమ సంతాన్ని నియంత్రించుకోవాలన్న ఆలోచన రాదు.. అలాంటి ఆలోచన వచ్చేది మనుషులకే కాబట్టి వాటి సంతతిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. వీధి కుక్కల నియంత్రణకు ఇప్పటికే కనబడిన వీధి కుక్కకల్లా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేస్తున్నారు.
Also Read : శోభనం రోజే వింత కోరికతో షాకిచ్చిన భర్త.. ఉదయం జంప్!
కోతుల సంఖ్య దేశంలో అనూహ్యంగా పెరిగిపోతోంది. అనేక చోట్ల అవి గ్రామాలపై దాడులు చేస్తున్నాయి. వాటికి కావాల్సిన ఆహారం కోసం దాడులు కూడా చేస్తున్నాయి. పంటలను కూడా ధ్వంసం చేస్తున్నాయి. ఏటా రెండు, మూడు వందల ఎకరాలు కోతుల పరం అవుతున్నాయి. ఈ కారణాలతో కోతుల జనాభాను నియంత్రించాలన్న ప్రభుత్వాలకు వచ్చింది. దక్షిణాదిలో తొలి సారిగా నిర్మల్ జిల్లాలో కోతుల సంతాన నియంత్రణ కేంద్రానికి కేంద్రం అంగీకారం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం సై అంది.
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
2016లోనే నిర్మల్ సారంగపూర్ మండలంలో చించోలి(బి) శివారులోని అటవీ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టుగా కోతుల సంతాన నియంత్రణ కేంద్రానికి స్థలం ఎంపిక చేశారు. కానీ అప్పట్నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఫలించి 2020లో అందుబాటులోకి వచ్చింది. మొదటగా వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న కోతులను ఈ సంరక్షణ కేంద్రానికి తీసుకొస్తారు. విపరీతంగా పెరిగిపోతున్న వానరాల సంతతిని అరికట్టేందుకు అక్కడ తొలుత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తారు. అవి పూర్తిగా కోలుకున్నాక మళ్లీ అడవుల్లో వదిలేస్తారు.
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..
నిర్మల్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ కేంద్రంలో పశువైద్యాధికారి, సహాయకులతో పాటు ఓ ప్రయోగశాల, ఆపరేషన్ థియేటర్, డాక్టర్స్ రెస్ట్ రూమ్స్, ఇతర పరికరాలను ఏర్పాటు చేశారు. ఇక కోతులకు ఇష్టమైన పండ్ల చెట్లను కూడా ఈ కేంద్రంలో పెంచారు. కోతులను ఉంచేందుకు ప్రత్యేకంగా బోనులను సైతం తయారు చేశారు. అలాగే సిబ్బంది అక్కడే ఉండేలా వసతి గృహాన్ని సైతం నిర్మించారు. ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రం మొదటిది కాగా, తెలంగాణలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం రెండోది. ఏడాది నుంచి అక్కడ కోతులకు ఆపరేషన్లు జరుగుతున్నాయి.
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)