Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద - 18 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల
Nagarjuna Sagar Floods: నాగార్జున సాగర్ జలశయానికి భారీగా వరద చేరుతున్న క్రమంలో అధికారులు 18 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు, శ్రీశైలంలోనూ 6 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు.
18 Crust Gates Opened In Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు (Nagarjuna Sagar) మరోసారి జల ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికారులు 18 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం రాత్రికి సాగర్ వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 1,94,758 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులుగానే ఉంది. జలాశయ పూర్తి స్థాయి, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ వద్ద విద్యుత్ కాంతులతో జల ప్రవాహం కనువిందు చేస్తోంది.
మరోవైపు, శ్రీశైలం జలాశయంలోనూ (Srisailam Project) వరద కొనసాగుతోంది. అధికారులు 6 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,11,953 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1,81,008 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి, ప్రస్తుత నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి, ప్రస్తుత నీటి నిల్వ 215.8070 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ వద్ద జలకళతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి అనంతరం 68,807 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
Also Read: Pawan Kalyan: పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్, 12 వేల చీరలు పంపిన ఏపీ డిప్యూటీ సీఎం