YouTube Music: గుండె పగిలిందా? ఇదిగో ‘యూట్యూబ్’ను అడగండి, ఆ పాటలన్నీ వినిపిస్తుంది - ఈ సరికొత్త ఆప్షన్ మీ కోసమే!
మ్యూజిక్ లవర్స్ మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది యూట్యూబ్. అందులో భాగంగానే సరికొత్త మ్యూజిక్ మూడ్ ఫిల్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జోడిస్తూ వినియోగదారులకు సరికొత్తగా ఆకట్టుకుంటుంది వీడియో కంటెంట్ దిగ్గజం యూట్యూబ్. Spotify, Amazon Music లాంటి యాప్స్ తో పోటీపడేందుకు ఇప్పటికే YouTube Musicని అందుబాటులోకి తెచ్చింది. దీనికి ఎప్పటికప్పుడు సరికొత్త మెరుగులు అద్దుతోంది. తాజాగా Google YouTube Music యాప్‌కి ఐదు కొత్త ఫిల్టర్లను యాడ్ చేయబోతోంది. పార్టీ, ఫీల్ గుడ్, రొమాన్స్, స్లీప్, క్రై అనే ఫిల్టర్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. యూట్యూబ్ మ్యూజిక్ యాప్ ఇప్పుడు మ్యూజిక్ అప్లికేషన్ మార్కెట్‌లో పోటీ పడేందుకు Google సరికొత్తగా తీర్చిదిద్దుతోంది. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. తోటి మ్యూజిక్ యాప్స్ కు దీటుగా కొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. కొత్తగా యాడ్ అయ్యే ఫిల్టర్స్ తో వినియోగదారులు తమకు నచ్చిన సంగీతాన్ని ఆస్వాదించే అవకాశాన్ని కల్పించబోతోంది.
5 మ్యూజిక్ మూడ్ ఫిల్టర్లను తీసుకొచ్చిన యూట్యూబ్
టెక్ దిగ్గజం గూగుల్ YTM కోసం 2020లో మూడ్ ఫిల్టర్లతో కూడిన 'యాక్టివిటీ' బార్‌ను ప్రకటించింది. ఇప్పటికే ఉన్న ఫిల్టర్లు(ఎనర్జైజ్, కమ్యూట్, రిలాక్స్, ఫోకస్, వర్కౌట్) పాడ్ క్యాస్ట్‌లతో పాటు, సరికొత్తగా యాడ్ అవుతున్న 5 ఫిల్టర్లు వినియోగదారుల మ్యూజిక్ అనుభవాన్ని మరింత పెంచనున్నాయి. తాజాగా అందుబాటులోకి తెచ్చిన 5 ఫిల్టర్లు ఎవరు ఏ మూడ్ లో ఉంటే ఆ మూడ్ కు తగినట్లుగా మ్యూజిక్ వినే అవకాశం ఉంటుంది. ఉదాహారణకు 'క్రై' ఫిల్టర్ ను సెలెక్ట్ చేసుకుంటే, విచారకరమైన పాటలను మాత్రమే వినే అవకాశం ఉంటుంది. ఈ కేటగిరిలోని పాటలన్నీ బాధను గుర్తు చేసేవే ఉంటాయి. లవ్ బ్రేక్ సహా పలు రకాల విషాద పాటలను వినే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే 6 ఫిల్టర్లు అందుబాటులో ఉండగా తాజాగా మరో 5 వచ్చి చేరడంతో ఇప్పుడు ఆ సంఖ్య 11కు చేరింది.
అందుబాటులోకి కొత్త మ్యూజిక్ మూడ్ ఫిల్టర్లు
ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్లు మరికొద్ది రోజుల్లోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని స్మార్ట్ ఫోన్లు, వెబ్ వినియోగదారులకు ప్రస్తుతం ఈ ఫిల్టర్‌లు అందుబాటులో ఉన్నాయని 9To5Mac నివేదిక వెల్లడించింది. అవి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని తెలిపింది. అయితే, YouTube Musicకు సంబంధించిన Android యాప్‌లో అన్ని ఫిల్టర్లను గుర్తించినట్లు పలువురు నెటిజన్లు వెల్లడిస్తున్నారు. అంతేకాదు, మ్యూజిక్ కేటగిరీ సెలెక్షన్ కు సంబంధించి కంపెనీ శాంపిల్ ట్యాబ్ ను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. కొత్త కళాకారులకు సంబంధించిన లేటెస్ట్ ట్రాక్ లను సెర్చ్ చేయడానికి మరింత అనుకూలంగా ఉండేలా ఓ విభాగాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా తాజాగా విడుదలైన మ్యూజిక్ మూడ్ ఫిల్టర్లు సంగీత ప్రియులను మరింతగా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇకపై ఎవరు ఏ మూడ్ లో ఉంటే, అదే మూడ్ కు సంబంధించిన పాటలను వినే అవకాశం కలగనుంది.
Read Also: ట్విటర్ యూజర్లకు షాక్ ఇవ్వనున్న మస్క్, అందరూ డబ్బు కట్టాల్సిందే !
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial