Xiaomi TV Stick 4K: మీ సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చే డివైస్.. లాంచ్ చేసిన షియోమీ!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన కొత్త టీవీ స్టిక్‌ను లాంచ్ చేసింది. అదే ఎంఐ టీవీ స్టిక్.

షియోమీ టీవీ స్టిక్ 4కే లాంచ్ అయింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంఐ టీవీ స్టిక్‌కి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ స్టిక్ లాంచ్ అయింది. పేరులో ఉన్నట్లు ఇది 4కే స్ట్రీమింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 టీవీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ బాక్స్ పనిచేయనుంది.
ప్రస్తుతం షియోమీ టీవీ స్టిక్ 4కే కంపెనీ గ్లోబల్ వెబ్‌సైట్లో మాత్రమే లిస్ట్ అయింది. అయితే దీని ధరను ఇంకా కంపెనీ వెల్లడించలేదు. ఎంఐ టీవీ స్టిక్ యూరోప్‌లో 39.99 యూరోలుగా (సుమారు రూ.3,400) ఉంది. మనదేశంలో రూ.2,799 ధరతో ఈ టీవీ లాంచ్ అయింది.
షియోమీ టీవీ స్టిక్ 4కే స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ యాప్స్ ప్రీ-లోడెడ్‌గా రానున్నాయి. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి. ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. ఇందులో 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌ను అందించారు.
ఇందులో నాలుగు కార్టెక్స్ ఏ-35 కోర్లను అందించారు. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందించారు. హెచ్‌డీఎంఐ పోర్టు కూడా ఇందులో ఉంది. పవర్ కోసం మైక్రో యూఎస్‌బీ పోర్టును అందించారు.
దీని మందం 1.54 సెంటీమీటర్లుగానూ, బరువు 42.8 గ్రాములుగానూ ఉంది. ఇది రిమోట్‌తో పెయిర్ అవుతుంది. ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ షార్ట్‌కట్స్ కూడా ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్‌కు ప్రత్యేకమైన బటన్‌ను అందించారు. షియోమీ బ్రాండింగ్‌ను కూడా ఇందులో చూడవచ్చు. గతంలో లాంచ్ అయిన మోడల్స్ మీద ఎంఐ లోగో ఉండేది.
Also Read: Jio 1 Rs Recharge Plan: రూ.1కే జియో రీచార్జ్ ప్లాన్.. లాభాలు ఏంటంటే?
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!





















