అన్వేషించండి

Xiaomi HyperOS: ఎంఐయూఐకి బై - హైపర్ఓఎస్‌కు హాయ్ - త్వరలో షావోమీ కొత్త ఆపరేటింగ్ సిస్టం!

షావోమీ కొత్త ఆపరేటింగ్ సిస్టం హైపర్ఓఎస్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.

HyperOS in Xiaomi 14 Series: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీ తను త్వరలో లాంచ్ చేయనున్న మొబైల్ ఫోన్ల కోసం ఎంఐయూఐ స్థానంలో కొత్త హైపర్ఓఎస్‌ను ప్రకటించింది. కంపెనీ సీఈవో లీ జున్ తెలుపుతున్న దాని ప్రకారం హైపర్ఓఎస్‌పై కంపెనీ ఎన్నో సంవత్సరాల నుంచి పని చేస్తుంది.

త్వరలో లాంచ్ కానున్న షావోమీ 14 సిరీస్‌తో పాటు హైపర్ఓఎస్‌ను కంపెనీ ప్రజలకు అందించనుంది. ప్రస్తుతానికి హైపర్‌ఓఎస్ చైనాకే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్/ట్విట్టర్‌లో ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు భవిష్యత్తులో చైనా వెలుపల కూడా ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కంపెనీ సీఈవో లీ జున్ సమాధానం ఇచ్చాడు.

రోజురోజుకూ తగ్గుతున్న ఎంఐయూఐ పాపులారిటీ
షావోమీ లాంచ్ చేసిన విజయవంతమైన ఉత్పత్తుల్లో షావోమీ ఎంఐయూఐ కూడా ఒకటి. అయితే గత కొన్ని సంవత్సరాలలో ఎంఐయూఐ దాని ప్రజాదరణను కోల్పోవడం ప్రారంభించింది. కలర్ఓఎస్, ఇతర ఆప్షన్లతో పోలిస్తే ఎంఐయూఐలో ఏమాత్రం ఆకర్షణీయంగా లేదు. అలాగే కంపెనీ దీన్ని ప్రత్యేకంగా అప్‌డేట్ కూడా చేయలేదు. 

ఎంఐయూఐ అనేది షావోమీ స్మార్ట్ ఫోన్ కంపెనీ రూపొందించిన స్టాక్, ఆఫ్టర్ మార్కెట్ ఫర్మ్‌వేర్. దీనిలో మీరు స్టాక్ ఆండ్రాయిడ్‌లో అందుబాటులో లేని కొన్ని అదనపు యాప్‌లను కంపెనీ నుంచి పొందుతారు. ప్రస్తుతం షావోమీ త్వరలో లాంచ్ చేయనున్న హైపర్ఓఎస్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. దానిలోని ప్రత్యేకత ఏమిటి, ఇది ప్రజలకు ఎటువంటి కొత్త ఫీచర్లను అందిస్తుంది అనే విషయమై రానున్న రోజుల్లో సమాచారం అందుతుంది.

అలాగే షావోమీ త్వరలో లాంచ్ చేయనున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్ షావోమీ 14 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు కూడా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుందని సమాచారం. అలాగే 90W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉండే అవకాశం ఉంది.

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tiger Attacked In Komaram Bheem District: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Attacked In Komaram Bheem District: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
HP Black Friday Deals: బ్లాక్ ఫ్రైడే బంపర్ ఆఫర్ ఇస్తున్న హెచ్‌పీ - ల్యాప్‌టాప్‌లు, పీసీలపై భారీ క్యాష్‌బ్యాక్!
బ్లాక్ ఫ్రైడే బంపర్ ఆఫర్ ఇస్తున్న హెచ్‌పీ - ల్యాప్‌టాప్‌లు, పీసీలపై భారీ క్యాష్‌బ్యాక్!
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Embed widget