By: ABP Desam | Updated at : 10 Jan 2022 07:27 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
షియోమీ 11టీ ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో జనవరి 19వ తేదీన లాంచ్ కానుంది. (Image Credit: Xiaomi)
షియోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో జనవరి 19వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ యూరోప్‌లో గతంలోనే లాంచ్ అయింది. షియోమీ 11టీ ప్రోలో 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. దీంతోపాటు 120 హెర్ట్జ్ డిస్‌ప్లే కూడా ఇందులో ఉండనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ను అందించనున్నారు.
ఈ ఫోన్ లాంచ్ తేదీని షియోమీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. దీని టీజర్‌లో ఫోన్ వెనకవైపు చూడవచ్చు. ఎంఐ.కాంకు సంబంధించిన ప్రత్యేకమైన మైక్రోసైట్‌ను కూడా కంపెనీ క్రియేట్ చేసింది. ఈ ఫోన్‌పై ప్రస్తుతం మార్కెట్ వర్గాల్లో మంచి హైప్ ఉంది.
గతవారంలో షియోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. అప్పుడే షియోమీ తన ‘హైపర్ ఫోన్’ను మనదేశంలో టీజ్ చేసింది. ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్లో కూడా కనిపించింది. రెగ్యులర్ షియోమీ 11టీతో పాటు ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
షియోమీ 11టీ ప్రో ధర
మనదేశంలో ఈ ఫోన్ ధర ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే యూరోప్‌లో మాత్రం ఈ ఫోన్ లాంచ్ అయింది. దీని ప్రకారం.. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 649 యూరోలుగా (సుమారు రూ.54,500) ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 699 యూరోలుగానూ (సుమారు రూ.58,700), టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 749 యూరోలుగానూ (సుమారు రూ.62,900) నిర్ణయించారు. అయితే మనదేశంలో మాత్రం ఇంతకంటే తక్కువ ధరతోనే ఈ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
షియోమీ 11టీ ప్రో స్పెసిఫికేషన్లు
షియోమీ 11టీ ప్రోలో 6.67 అంగుళాల 10-బిట్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించనున్నారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, టెలిఫొటో సెన్సార్ కూడా ఉండనుంది. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించనున్నారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 120W హైపర్‌చార్జ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. కేవలం 15 నిమిషాల్లోనే ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ కానుంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కంపెనీ అందించింది. ఈ స్పీకర్లను హార్మన్ కార్డన్ ట్యూన్ చేశారు.
Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Common Charging Port: మొబైల్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
Jio 5G Phone: రూ.10 వేలలోపే జియో 5జీ ఫోన్ - ప్రత్యేకతలు ఏంటంటే?
Moto Tab G62: మోటొరోలా కొత్త ట్యాబ్ వచ్చేసింది - తక్కువ ధరలోనే పెద్ద డిస్‌ప్లే!
Vivo V25 Pro: ఊహించిన దాని కంటే తక్కువ ధరకే - లాంచ్ అయిన వివో వీ25 ప్రో!
TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !
KCR Medchal : దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !
YSRCP Vs Janasena : వైఎస్ఆర్‌సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !
Munugode Bypoll : రేవంత్ టార్గెట్‌గా సీనియర్ల దండయాత్ర - మునుగోడు ముందు మునిగిపోతున్న టీ కాంగ్రెస్ !