Highest YouTube Subscribers: భారతీయ యూట్యూబ్ చానెల్ ప్రపంచ రికార్డు.. ఏకంగా 200 మిలియన్ సబ్‌స్కైబర్లు!
భారతీయ యూట్యూబ్ చానెల్ టీ-సిరీస్ 200 మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మార్కును దాటింది. ఈ రికార్డు సృష్టించిన మొదటి చానెల్‌గా నిలిచింది.
భారతీయ మ్యూజిక్ రికార్డు లేబుల్, సినిమా ప్రొడక్షన్ కంపెనీ టీ-సిరీస్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచంలో 200 మిలియన్ సబ్‌స్క్రైబర్ల మార్కును దాటిన మొదటి చానెల్‌గా టీ-సిరీస్ యూట్యూబ్ చానెల్ నిలిచింది.
ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ట్వీటర్‌లో తెలిపింది. ‘ప్రపంచంలోనే నంబర్ వన్ యూట్యూబ్ చానెల్ అయిన టీ-సిరీస్ 200 మిలియన్ సబ్‌స్క్రైబర్ల మార్కును దాటింది. ప్రపంచంలో ఈ మార్కును అందుకున్న మొదటి చానెల్‌గా నిలిచింది! యూట్యూబ్‌లోని టాప్ చానెల్‌గా ఒక భారతీయ చానెల్ నిలవడం దేశం మొత్తానికి గర్వకారణం.’ అని ఈ ట్వీట్‌లో తెలిపారు. #TSeriesHits200MilSubs అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ఇందులో ఉపయోగించారు.
టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌ను అభినందిస్తూ ప్రముఖ హీరోయిన్ సారా అలీఖాన్ ఒక వీడియోను విడుదల చేసింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా ఉంచుకుంది. దీంతోపాటు భూషణ్ కూడా ఉన్న వీడియోని విడుదల చేసి, శుభాకాంక్షలను తనదైన స్టైల్‌లో తెలిపింది.
టీ-సిరీస్‌ను గుల్షన్ కుమార్ 1983 జులై 11వ తేదీన స్థాపించాడు. ఆ సమయానికి ఆయన ఢిల్లీలో పండ్ల వ్యాపారం చేసేవారు. 1997లో ఆయన హత్యకు గురైన అనంతరం ఆయన తమ్ముడు క్రిషన్ కుమార్, కుమారుడు భూషణ్ కుమార్ కంపెనీని నడిపిస్తున్నారు. ఆయన కుమార్తెలు తులసీ కుమార్, ఖుషాలీ కుమార్ కూడా ప్లేబ్యాక్ సింగర్లే.
మొదట హిందీలోనే ప్రారంభం అయినప్పటికీ తర్వాత భోజ్‌పురి, పంజాబీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, గుజరాతీ, మరాఠీ, రాజస్తానీ భాషల్లో కూడా ప్రత్యేకమైన చానెళ్లని ఏర్పాటు చేసుకున్నారు. టీ-సిరీస్‌కు ఉన్న మొత్తం 29 చానెళ్లకు కలిపి 383 మిలియన్లకు పైగా సబ్‌స్కైబర్లు ఉన్నారు.
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!