iPhone 14: ఐఫోన్ 14 ఎక్కడ తక్కువ ధరకు కొనవచ్చు? - అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఎందులో బెస్ట్ ఆఫర్లు!
యాపిల్ ఐఫోన్ 14 ఏ వెబ్ సైట్‌లో చవకైన ధరకు కొనుగోలు చేయవచ్చు?
Amazon vs Flipkart iPhone 14: ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్, బిగ్ సేవింగ్ డే సేల్‌లో ప్రైమ్ డే సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. ఈ సేల్ జూలై 19వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ రెండు వెబ్‌సైట్లలో ఐఫోన్ 14పై మంచి డిస్కౌంట్ అందించారు. మీరు ఐఫోన్ 14ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఏ వెబ్‌సైట్‌లో చవకగా లభించనుందో చూద్దాం.
ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో రూ.66,999 ధరతో లిస్ట్ అయింది. దీనిపై రూ.1,500 బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభించనుంది. ఇది కాకుండా మొబైల్ ఫోన్‌పై రూ. 50,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా లభించనుంది. మీరు పాత ఫోన్‌ని మార్చుకుని కొత్త ఫోన్‌ని తీసుకుంటే, ఐఫోన్ 14ను మరింత తక్కువ ధరకు పొందుతారు.
ఐఫోన్ 14 128 జీబీ వేరియంట్ (రెడ్ కలర్ వేరియంట్) రూ.67,999కి ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, సిటీ క్రెడిట్ కార్డ్‌లపై మొబైల్ ఫోన్‌లపై 10 శాతం (రూ. 1,000 వరకు) తగ్గింపు లభించనుంది. ఇది కాకుండా రూ.35,600 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు.
రెండు వెబ్‌సైట్‌లను కంపేర్ చేస్తే మీరు అమెజాన్‌లో ఐఫోన్ 14ను చవకైన ధరకు పొందుతారు. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఇంకొంచెం ఎక్కువగా లభిస్తే ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌ను మరింత చవకగా కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.
దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది.
ఐఫోన్ 14తో పాటు 14 ప్లస్ కూడా అందుబాటులో ఉంది. దీని విషయానికి వస్తే... ఇందులో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.
దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14 ప్లస్‌లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది. ఐఫోన్ 14 కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది.
Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial