Whatsapp: మరో సూపర్ ప్రైవసీ ఫీచర్‌ను తీసుకురానున్న వాట్సాప్ - ఇకపై యాప్‌లో అలా చేయలేం!
Whatsapp New Feature: వాట్సాప్ కొత్త ప్రైవసీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై యాప్‌లో ప్రొఫైల్ పిక్చర్లు స్క్రీన్ షాట్ తీయలేం.
![Whatsapp: మరో సూపర్ ప్రైవసీ ఫీచర్‌ను తీసుకురానున్న వాట్సాప్ - ఇకపై యాప్‌లో అలా చేయలేం! Whatsapp To Bring New Security Feature Blocking Screenshots of Profile Pictures Check Details Whatsapp: మరో సూపర్ ప్రైవసీ ఫీచర్‌ను తీసుకురానున్న వాట్సాప్ - ఇకపై యాప్‌లో అలా చేయలేం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/14/2e1becafa25b5485e5e4493a3918322f1710430561629252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Whatsapp New Security Feature: వాట్సాప్ తన యాప్‌లో సరికొత్త ప్రైవసీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది కొంతమందికి హ్యాపీనెస్‌ని, మరి కొంత మందికి నిరాశను కలిగించవచ్చు. ఇకపై వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్‌లో ప్రొఫైల్ పిక్చర్లను స్క్రీన్ షాట్ తీయడం కుదరదు. దీనికి సంబంధించిన టెస్టింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. త్వరలో ఇది అందరు యూజర్లకు అందుబాటులోకి రానుంది. దీంతో పాటు మల్టీపుల్ ఛాట్‌లను పిన్ చేసే ఫీచర్‌ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇది కూడా టెస్టింగ్‌లో ఉంది. దీని ద్వారా పర్సనల్, గ్రూప్ ఛాట్లను పిన్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ స్క్రీన్ షాట్ బ్లాకింగ్‌కు సంబంధించిన వివరాలను మెటా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ రోల్అవుట్ ఆండ్రాయిడ్ పోలీస్ మొదట గుర్తించింది. బీటా వెర్షన్ వాడు యూజర్లు ఇప్పటికే ప్రొఫైల్ పిక్చర్‌ను స్క్రీన్ షాట్ తీయడం కుదరడం లేదు. అయితే బీటా వెర్షన్లు కాకుండా స్టాండర్డ్ వెర్షన్లు ఉపయోగించే వారు మాత్రం స్క్రీన్ షాట్లు తీయగలుగుతున్నారు.
అయితే వాట్సాప్‌లో స్క్రీన్ షాట్లు తీయడం బ్లాక్ చేసినంత యూజర్ ప్రైవసీకి పూర్తి స్థాయిలో భంగం వాటిల్లదని అనుకోలేం. ఒకవేళ ఆ ప్రొఫైల్ ఫొటో సేవ్ చేసుకోవాలి అనుకుంటే మరో డివైస్ నుంచి ఆ ప్రొఫైల్ ఫొటోని నేరుగా ఫొటో తీసే అవకాశం కూడా ఉంది. అంతే కాకుండా మెయిన్ చాట్ లిస్ట్‌ను స్క్రీన్ షాట్ తీసి అందులో నుంచి యూజర్ ప్రొఫైల్ ఫొటోను క్యాప్చర్ చేయవచ్చు. ఎందుకంటే వాట్సాప్ అక్కడ స్క్రీన్ షాట్లు బ్లాక్ చేయదు.
వాట్సాప్ ఫీచర్లను రెగ్యులర్‌గా ట్రాక్ చేసే WABetaInfo వెబ్‌సైట్లో మరో ఫీచర్ కూడా కనిపించింది. దీన్ని బట్టి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో యూజర్లు మల్టీపుల్ ఛాట్లను టాప్‌లో పిన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కేవలం ఒక్క ఛాట్‌ను మాత్రమే పిన్ చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది. త్వరలో రానున్న అప్‌డేట్ ద్వారా మూడు ఛాట్ల వరకు పిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.6.15లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో ఐవోఎస్, ఆండ్రాయిడ్ రెండిటికీ ఈ ఫీచర్‌ను మెటా అందించే అవకాశం ఉంది.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)