By: ABP Desam | Updated at : 23 May 2023 04:06 PM (IST)
Photo Credit: Pixabay
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వినియోగదారులకు కలిగి ఉన్న యాప్స్ లో వాట్సాప్ టాప్ లో ఉంటుంది. వాట్సాప్ ద్వారా ఎంతో మంది, ఎన్నో పనులకు చక్కదిద్దుకుంటున్నారు. ఆఫీస్ వర్క్ తో పాటు, వ్యక్తిగత సమాచారాన్ని వాట్సాప్ ద్వారా పంచుకుంటారు వినియోగదారులు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో తమ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది వాట్సాప్. మరింత ఈజీగా సేవలను పొందేలా నూతన ఫీచర్లకు శ్రీకారం చుడుతూనే ఉంది.
తాజాగా వాట్సాప్ వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడే సరికొత్త ఆప్షన్ ను తీసుకొచ్చింది. అదే ‘ఎడిట్’ ఫీచర్. మీ బంధు, మిత్రుల్లో ఎవరికైనా పంపిన సందేశాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి ఆ పొరపాట్లను సరిదిద్దుకోవడానికి వాట్సాప్ 15 నిమిషాల విండో అవకాశం కల్పిస్తోంది. ఇక నుంచి వినియోగదారులు పంపిన మెసేజ్ లో ఏదైనా తప్పు దొర్లితే పూర్తిగా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎడిట్ బటన్ ఆప్షన్ వాడుకుని తప్పును సరిచేసే అవకాశం ఉంటుంది. వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్ పంపిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేస్తే కాపీ, ఫార్వర్డ్ లాంటి ఆప్షన్లు కన్పిస్తాయి. ఇకపై వాటితోపాటు ఎడిట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పంపిన మెసేజ్‌లో తప్పులు, స్పెల్లింగ్‌లు వంటివి సరిచేసుకోవచ్చు. యూజర్లకు ఎంతగానో ఉపయోగపడే ‘ఎడిట్’ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సాప్ మాతృ సంస్థ మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
అటు ఈ విషయాన్ని వాట్సాప్ కూడా వెల్లడించింది. “మీ చాట్స్ మీద మీకు ఇప్పుడు మరింత నియంత్రణ కలిగి ఉండబోతున్నందుకు మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఎడిట్ ఆప్షన్ సాయంతో మెసేజ్ లలో జరిగే పొరపాట్లను సరిచేయడంతో పాటు, మరింత మెసేజ్ ను యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక మెసేజ్ పంపిన తర్వాత 15 నిమిషాల్లోపు ఎడిట్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. పంపిన మెసేజ్ మీద టాప్ చేసి హోల్డ్ లో పెట్టాలి. అటుపై మెసేజ్ సరి చేసిన తర్వాత పంపించుకుంటే సరిపోతుంది” అని తన వాట్సాప్ తన బ్లాగ్ పోస్ట్ లో వెల్లడించింది.
గతంలో చాలా మంది వాట్సాప్ వినియోగదారులు పొరపాటుగా తప్పు మెసేజ్ లు పంపించి చాలా ఇబ్బందులు పడే వారు. ఒక వేళ అలా పంపిన మెసేజ్ ను వెంటనే డిలీట్ చేసేవారు. కానీ, ఇప్పుడు వచ్చిన ఎడిట్ ఆప్షన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎడిటింగ్ కోసం 15 నిమిషాల టైమ్ ఇవ్వడం మంచి నిర్ణయంగా భావించవచ్చు. ఇకపై ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా మెసేజ్ లు పంపించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా మంది యూజర్లకు కొత్తగా ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇప్పటికిప్పుడే అందరికీ అందుబాటులోకి రాదని వాట్సాప్ తెలిపింది. యూజర్లంతా అప్ డేట్ కావడానికి మరికాస్త సమయం పట్టే అవకాశం ఉంటుందని వెల్లడించింది.
Galaxy F54 5G India: అదిరిపోయే కెమెరా, అద్భుతమైన ఫీచర్లు, Galaxy F54 5G లాంచింగ్ డేట్ ఫిక్స్
Coin On Railway Track: రైలు పట్టాలపై ఎప్పుడైనా నాణెం పెట్టారా? ఏమవుతుందో తెలుసా?
Top 5 smartphones: మంచి స్టోరేజ్, చక్కటి బ్యాటరీ ఫర్ఫార్మెన్స్- రూ.12,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే!
WhatsApp New Feature: ఇకపై స్టేటస్ కూడా ఆర్కైవ్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్
Daam malware: ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త! ఈ మాల్వేర్ మహా డేంజర్!
పత్తికొండలో రైతు భరోసా నిధులు విడుదల- జరిగిన మేలు గుర్తించాలని జగన్ విజ్ఞప్తి
Congress Konda Murali Sensational Comments: కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్న మురళి
నాని పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? జరుగుతున్న ప్రచారంపై ఎంపీ రియాక్షన్ ఏంటీ?
Spiderman: Across The Spiderverse Review: స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్వర్స్ రివ్యూ: యానిమేటెడ్ స్పైడర్ మ్యాన్ ఆకట్టుకున్నాడా? నిరాశ పరిచాడా?