WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ వచ్చేసింది - ఏకంగా 1,024 మందితో గ్రూప్!
వాట్సాప్ కమ్యూనిటీస్ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
వాట్సాప్ గురువారం కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. అవే వాట్సాప్ డిస్కషన్ గ్రూప్ లేదా వాట్సాప్ కమ్యూనిటీస్. ఈ ఫీచర్‌ను కంపెనీ చాలా కాలం నుంచి టెస్ట్ చేస్తూనే ఉంది. వాట్సాప్ కమ్యూనిటీస్ ద్వారా మెరుగైన అడ్మిన్ కంట్రోల్స్‌ను ఈ ఫీచర్ అందించనుంది. దీంతో వాట్సాప్ వర్క్ ప్లేస్ టూల్స్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చిందని అనుకోవచ్చు.
వాట్సాప్ కమ్యూనిటీస్‌తో కొత్తగా మూడు ఫీచర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇన్ చాట్ పోల్స్ క్రియేట్ చేయడం, 32 మందితో వీడియో కాలింగ్, 1,024 మందితో గ్రూప్ క్రియేట్ చేసే సామర్థ్యాన్ని వాట్సాప్ అందించింది. వాట్సాప్ కమ్యూనిటీస్ ఫీచర్‌ను కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.
‘వాట్సాప్ కమ్యూనిటీస్‌ను ఈరోజు మేం లాంచ్ చేస్తున్నాం. సబ్ గ్రూప్స్ ద్వారా గ్రూపులను ఇది మరింత బెటర్ చేయనుంది. వాట్సాప్‌లో పోల్స్, 32 పర్సన్ వీడియో కాలింగ్ కూడా అందుబాటులో ఉండనుంది. వీటన్నిటికీ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండనుంది. మీ మెసేజ్‌లు ప్రైవేట్‌గానే ఉంటాయి.’ అని మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ వాల్‌పై పోస్ట్ చేశారు.
ఈ అప్‌డేట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు అందరికీ కొన్ని నెలల్లో అందుబాటులోకి రానుంది. ‘ఎమోజీ రియాక్షన్స్ తరహాలోనే లార్జర్ ఫైల్ షేరింగ్, అడ్మిన్ డిలీట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి. ఇది కమ్యూనిటీస్‌కు ఎంతో ఉపయోగపడనుంది.’ అని వాట్సాప్ తన బ్లాగ్ పోస్టులో తెలిపింది. వాట్సాప్ త్వరలో మరిన్ని ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.
వాట్సాప్ ఇటీవలే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో గ్రూప్‌లో మెసేజ్ చేస్తున్న సభ్యుల ప్రొఫైల్ ఫోటో కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇతర వినియోగదారులు ఈ ఫీచర్ కోసం మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ పూర్తిగా అందుబాటులోకి వస్తే మీరు గ్రూప్ సభ్యుల ఫోటోలను చూడటానికి వారి ప్రొఫైల్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మెసేజ్, పేరుతో పాటు, వారి ఫోటో కూడా గ్రూప్ చాట్‌లో మీకు కనిపిస్తుంది.
వాట్సాప్ త్వరలో తీసుకురానున్న ఈ ఫీచర్‌ను మొదట WABetainfo లీక్ చేసింది. దీని కథనం ప్రకారం, WhatsApp ఈ ఫీచర్‌ను కొంతమంది బీటా టెస్టర్‌లకు విడుదల చేసింది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్ట్‌ఫ్లైట్ యాప్ నుంచి iOS కోసం WhatsApp బీటా తాజా వెర్షన్‌ను అమలు చేస్తున్న బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
View this post on Instagram