అన్వేషించండి

Vodafone Idea Data Plan: అదనపు డేటా అందించే ప్లాన్ రివీల్ చేసిన వొడాఫోన్ ఐడియా - ఎంత డేటా లభించనుందంటే?

Vodafone Idea Additional Data Plan: వొడాఫోన్ ఐడియా అదనపు డేటా అందించే కొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. అదే వీఐ రూ.75 ప్లాన్.

Vodafone Idea: భారతదేశపు మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ వీఐ (Vodafone Idea) తన వినియోగదారులకు అదనపు ఇంటర్నెట్ డేటా సౌకర్యాన్ని అందించడానికి రూ.75 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఒక డేటా యాడ్ఆన్ ప్లాన్. అంటే వినియోగదారులు తమ ప్రస్తుత ప్లాన్‌లో ఇంటర్నెట్ డేటా అయిపోయిన తర్వాత ఈ ప్లాన్ ద్వారా అదనపు డేటాను పొందగలుగుతారు.

వొడాఫోన్ ఐడియా వినియోగదారులు అదనపు డేటాను పొందాలనుకుంటే, వారు ఈ రూ. 75 ప్లాన్‌ని ఉపయోగించవచ్చు. అయితే ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలంటే వినియోగదారులు తప్పనిసరిగా బేసిక్ ప్లాన్‌ను కూడా కలిగి ఉండాలి. ఎటువంటి బేస్ ప్లాన్ లేకుండా వినియోగదారులు ఈ ప్లాన్ ద్వారా అదనపు ఇంటర్నెట్ డేటాను ఉపయోగించలేరు.

ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేయడానికి ముందు వినియోగదారులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారు వీఐ మొబైల్ యాప్‌ని ఉపయోగించి రూ. 75 రీఛార్జ్ చేస్తే, అదనపు డేటా ప్రయోజనం పొందుతారు. అంతే తప్ప ఏదైనా ఇతర ప్లాట్‌ఫారమ్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే ఈ అదనపు డేటా ప్రయోజనం పొందలేరు. వొడాఫోన్ ఐడియా యాప్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది.

లాభాలేంటి?
వొడాఫోన్ ఐడియా రూ.75 ప్లాన్ ప్లాన్ వ్యాలిడిటీ ఏడు రోజులుగా ఉండనుంది. 6 జీబీ డేటాతో వస్తుంది. అయితే వినియోగదారులు వీఐ మొబైల్ యాప్ ద్వారా ఈ ప్లాన్ కోసం రీఛార్జ్ చేసుకుంటే, వారికి 1.5 జీబీ అదనపు డేటా లభిస్తుంది. అంటే రూ.75 ప్లాన్‌లో యూజర్లు మొత్తం 7.5 జీబీ డేటాను పొందవచ్చు.

దీని ప్రకారం వినియోగదారులు ప్రతి 1 జీబీ డేటా కోసం రూ. 10 ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా అందించే ఆఫర్లు కావాలనుకుంటే ఎప్పటికప్పుడు యాప్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలి.

అయితే వొడాఫోన్ ఐడియా తన పోటీదారులైన జియో, ఎయిర్‌టెల్ కంటే చాలా వెనుకబడి ఉంది. జియో, ఎయిర్‌టెల్ గత కొన్ని నెలలుగా దేశంలో 5జీ సేవను ప్రారంభిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఉచిత ట్రయల్స్‌ను ఇంకా అమలు చేస్తున్నాయి. అతి త్వరలో 5జీ ప్లాన్‌ల రేట్లను కూడా ప్రకటించనున్నారు. వొడాఫోన్ ఐడియా ఇంకా దేశవ్యాప్తంగా తన 4జీ నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో విస్తరించలేకపోయింది. వీఐ తన 4జీ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి, వీలైనంత త్వరగా 5జీ సర్వీసును ప్రారంభించేందుకు నిధుల సేకరణలో బిజీగా ఉంది.

వొడాఫోన్ ఐడియా ఇటీవలే ఢిల్లీ, పుణేలోని కొన్ని ప్రాంతాల్లో తన 5జీ సేవలను ప్రారంభించింది. ఈ సమాచారాన్ని కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించారు. వొడాఫోన్ ఐడియా నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. వెబ్‌సైట్‌లో పేర్కొన్న దాని ప్రకారం వినియోగదారులు 5జీ రెడీ సిమ్ సహాయంతో హై స్పీడ్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్‌లో వొడాఫోన్ ఐడియా ప్రమోటర్ కుమార్ మంగళం బిర్లా గత సంవత్సరం 5జీ లాంచ్, రాబోయే త్రైమాసికంలో కోర్ నెట్‌వర్క్‌పై చాలా కృషి చేసిందని పేర్కొన్నారు.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget