By: ABP Desam | Updated at : 24 Jan 2022 02:31 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వివో వై21ఏ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది.
వివో వై21ఏ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌ను అందించారు. 2020 డిసెంబర్‌లో లాంచ్ అయిన వివో వై20ఏకు తర్వాతి వెర్షన్‌గా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
వివో వై21ఏ ధర
ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. డైమండ్ గ్లో, మిడ్ నైట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను బట్టి చూస్తే రూ.10,000 నుంచి రూ.12,000 వేల మధ్యలో దీని ధర ఉండే అవకాశం ఉంది. ఇందులో కేవలం 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది.
వివో వై21ఏ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ర్యామ్‌ను మరో 1 జీబీ పెంచుకోవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రోకెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.
యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, వర్చువల్ గైరోస్కోప్‌లు కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా దీన్ని చార్జ్ చేయవచ్చు. దీని మందం 0.8 సెంటీమీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.
Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Instagram photo edit: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?
5G Phones Under Rs 20k: రూ.20 వేలలోపు టాప్ 5జీ ఫోన్లు ఇవే - న్యూ ఇయర్ ఆఫర్లలో రేట్ ఇంకా తగ్గచ్చేమో!
Whatsapp Privacy: వాట్సాప్ వెబ్ వాడే వాళ్లు కచ్చితంగా ఆన్ చేసుకోవాల్సిన ఫీచర్ - లేకపోతే ప్రైవసీ డేంజర్లో!
Airtel Netflix Plan: ఈ ఎయిర్టెల్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ - రీఛార్జ్‌కు ఎంత పెట్టాలి?
Smartphones Under Rs 30000: రూ.30 వేలలోపు మంచి టాప్ ఎండ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? - ఈ టాప్-5 ఆప్షన్లు అయితే బెస్ట్!
Lets Vote : ఓటేద్దాం రండి - ఓటు మన హక్కే కాదు బాధ్యత కూడా !
Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే
Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
/body>