Vivo Y200i: 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై200ఐ - ధర ఎంత ఉందంటే?
Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ వై200ఐని చైనాలో లాంచ్ చేసింది. త్వరలో మనదేశంలో కూడా ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.
Vivo Y200i Launched: వివో వై200ఐ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. కంపెనీ లేటెస్ట్ వై-సిరీస్‌లో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టంపై వివో వై200ఐ పని చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 12 జీబీ వరకు ర్యామ్ ఈ ఫోన్‌లో ఉంది. ఇందులో 6.72 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.
వివో వై200ఐ ధర (Vivo Y200i Price)
ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 యువాన్లుగా (సుమారు రూ.18,800) నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799 యువాన్లుగానూ (సుమారు రూ.21,200), 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లుగానూ (సుమారు రూ.23,500) ఉంది. గ్లేసియర్ వైట్, స్టారీ నైట్, వాస్ట్ సీ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు
వివో వీ200ఐ స్పెసిపికేషన్లు, ఫీచర్లు (Vivo Y200i Specifications)
ఇందులో ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 4 స్కిన్‌ను అందించారు. 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో చూడవచ్చు. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై వివో వీ200ఐ రన్ కానుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో కంపెనీ డెలివర్ చేసింది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... వివో వీ200ఐలో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉండనుంది.
వివో వై200ఐ స్మార్ట్ ఫోన్‌లో స్టీరియో స్పీకర్లు అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చూడవచ్చు. ఏకంగా 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.81 సెంటీమీటర్లు కాగా, బరువు 199 గ్రాములుగా ఉంది.
Vivo Y200i is launched in china price at 1,599 yuan 8+256GB
— Sûjåñ Tharu (@SujanTharu66) April 20, 2024
1,799 yuan 12+256GB
1,999 yuan 12+512GB.
Snapdragon 4 Gen 2
LPDDR4X,UFS 2.2
📱6.72"LCD straight screen, full-screen peak 🔆 1000nit, 120Hz RR 120/240Hz touch sampling rate
🤳8MP
📸50MP+2MP
🔋6000mah#vivoy200i #vivo pic.twitter.com/o2GIz46MI2
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది